epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌లో అసంతృప్తి

ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌లో అసంతృప్తి
మండల అధ్యక్ష పదవిపై గాంధీభవన్‌లో వినతి
స్థానిక నాయకుడికే అవకాశం ఇవ్వాలని డిమాండ్
ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు
పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి
సామాజిక సమతుల్యత పాటించాలని కోరిన నాయకులు

కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్‌ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్ష పదవిని ఇనుగుర్తి టౌన్‌కు చెందిన నాయకుడికి కేటాయించాలని కోరుతూ మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు, గాంధీభవన్‌ ఇన్‌చార్జి కుమార్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ తమ్మడపల్లి కుమార్‌, దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ ఇనుగుర్తి మండలంపై చూపిస్తున్న వివక్షతను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేను, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇనుగుర్తి టౌన్‌ నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని పేర్కొన్నారు. గతంలో మండల పార్టీ అధ్యక్ష పదవిని విలీన గ్రామానికి చెందిన నాయకుడికి ఇచ్చారని, ఈసారి ఇనుగుర్తి టౌన్‌కు అవకాశం కల్పించాలని కోరినా తమ అభ్యర్థనను పట్టించుకోకుండా ఇతర గ్రామానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టౌన్‌ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోందన్నారు.

సామాజిక సమతుల్యత పాటించాలి

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు మండలాల పార్టీ అధ్యక్ష పదవులను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం పట్ల ఇతర సామాజిక వర్గాలు, దళిత వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను గౌరవించి ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌ విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. ఇనుగుర్తి టౌన్‌ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా మండల అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో చిన్నల కట్టయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ కొట్టం రాము, దేవులపల్లి వెంకన్న, వొల్లంల మురళి, పరుపాటి రవీందర్‌రెడ్డి, కొలిపాక నారాయణ, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు మహంకాళి సలీం, టౌన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌, బూర ఇస్తారి, గుజనూరి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.