epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోల్డ్‌ స్టోరేజీల్లో ‘జీరో దందా’పై ఉక్కుపాదం!

కోల్డ్‌ స్టోరేజీల్లో ‘జీరో దందా’పై ఉక్కుపాదం!
ధరల వ్యత్యాసం.. ఆర్‌డీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు
ఖమ్మం ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
వరంగల్‌లో వెంకటసాయి కోల్డ్‌ స్టోరేజ్‌లో తనిఖీలు

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: ఖమ్మం మార్కెట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆర్‌డీ అనుమతి వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్డ్‌ స్టోరేజీల్లో జరుగుతున్న ‘జీరో దందా’, ధరల వ్యత్యాసం, ఆర్‌డీ పేరుతో జరిగే అక్రమ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కోల్డ్‌ స్టోరేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వరంగల్‌ మార్కెట్‌ పరిధిలోని కోల్డ్‌ స్టోరేజీల్లో తనిఖీలు నిర్వహించింది. కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మార్కెట్‌ కార్యదర్శి పి. రమణ, కోరుట్ల మార్కెట్‌ కార్యదర్శి ఎం. ప్రశాంత్‌, మానకొండూరు సెక్రటరీ ఎం. శ్రావణ్‌తో కూడిన ప్రత్యేక బృందం వరంగల్‌ మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, డీఎంఓ సురేఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. తొలుత వెంకటసాయి కోల్డ్‌ స్టోరేజ్‌ను సందర్శించిన అధికారులు అక్కడి నిల్వలు, అమ్మకాలు, ప్రస్తుత స్టాక్‌ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

కాంటా చీటీలు.. సీసీ ఫుటేజ్‌ సేకరణ

కోల్డ్‌ స్టోరేజ్‌ యాజమాన్యం నుంచి కాంటా చీటీలు, స్టాక్‌ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు తీసుకున్నారు. గత నెల రోజుల సీసీ కెమెరా ఫుటేజ్‌ను కూడా పరిశీలన కోసం కోరారు. స్టాక్‌కు సంబంధించిన అన్ని లావాదేవీల వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కోల్డ్‌ స్టోరేజీలో రైతులకు చెందిన సరుకు ఎంత ఉంది? వ్యాపారులకు చెందిన సరుకు ఎంత ఉంది? ప్రస్తుతం ఎంత స్టాక్‌ ఉంది? ఎంత సరుకు విక్రయించారు? వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేసి ఉంచాలని అధికారులు సూచించారు. ఇటీవల ఖమ్మం మార్కెట్‌లో ధరల్లో వ్యత్యాసం, ఆర్‌డీకి అనుమతి వంటి అంశాల నేపథ్యంలో వ్యాపారులు లావాదేవీలు నిలిపివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం నేపథ్యంలో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉన్న సరుకు, విక్రయాల తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోల్డ్‌ స్టోరేజీల్లో సరుకు నిల్వలు, విక్రయాల్లో ‘జీరో దందా’, ఆర్‌డీ పేరుతో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీల్లో రికార్డులు, స్టాక్‌ వివరాలు, కాంటా చీటీలు, సీసీ ఫుటేజ్‌ తదితరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

బయటపడనున్న అక్రమాలెన్ని?

కోల్డ్‌ స్టోరేజీల్లో రైతులు, వ్యాపారుల సరుకు నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా? రికార్డుల్లో ఒక రకంగా.. క్షేత్రస్థాయిలో మరో రకంగా స్టాక్‌ చూపిస్తున్నారా? ఆర్‌డీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు బయటపడ్డాయన్నది అధికారులు వెల్లడించాల్సి ఉంది. తనిఖీల అనంతరం రికార్డులు, స్టాక్‌ వివరాలను సరిపోల్చి అక్రమాలు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులు, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం ఘటనతో మొదలైన ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా ‘జీరో దందా’పై ప్రభుత్వ నిఘా ఎంత మేరకు పనిచేస్తుందో తేల్చనున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.