ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారిగా యాస్మిన్
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారిగా షేక్ యాస్మిన్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారిక పనిచేసిన భూక్య మహేందర్ నెల్లికుదురు మండల వ్యవసాయ అధికారిగా డిప్యూటేషన్ పై వెళ్లడంతో నెల్లికుదురు మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించిన ఈమె డిప్యూటేషన్ పై ఇనుగుర్తి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టి లాభ సహాయ వ్యవసాయ పద్ధతుల కోసం నూతన పద్ధతులను రైతులకు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఫెర్టిలైజర్ షాపు యజమానులు,సర్పంచ్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సత్కరించారు.

