ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి.
– యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో నిరసన ఏమార్వోకు వినతి పత్రం అందజేత
కాకతీయ, పెద్దవంగర : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేస్తూ నిరసన తెలిపారు.ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉ ద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరారు. లేదంటే సంఘాల ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యుఎస్పిసి నాయకులు సోమారపు ఐలయ్య, ఎర్ర వెంకన్న, చిక్కాల సతీష్ , దేవదాస్,శ్రీనివాస్, ప్రభాకర్, రమేష్,దయాకర్, లక్ష్మయ్య వెంకటేశ్వర్లు , రాజు, యుగేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు

