epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూల్స్ కాగితాల‌కే ప‌రిమితం

రూల్స్ కాగితాల‌కే ప‌రిమితం
32 ఏళ్లుగా అమలుకు నోచుకోని విద్యాశాఖ‌ నిబంధనలు
ఉమ్మడి జిల్లాలో 900 ప్రైవేటు పాఠశాలలు
ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సిందే
వెబ్‌సైట్‌లో ఒక రేటు.. వసూళ్లలో మరో రేటా?
రసీదుల్లో ఎంత.. వాస్తవంగా చెల్లించేది ఎంత?

కాకతీయ, నిఘాప్ర‌తినిధి : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు నిబంధనలు ఉన్నాయి.. పాఠశాలలు వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన విధానం ఉంది. ఫీజులపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదే. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏటా పాఠశాలల ప్రారంభ సమయంలో ఫీజుల వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది. తల్లిదండ్రులపై ఫీజుల భారం పెరుగుతూనే ఉంది. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? పాఠశాలలు నిబంధనలను పాటిస్తున్నాయా? అన్నదే ప్రశ్న. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే 900 ప్రైవేటు పాఠశాలలు ఉండటంతో ఈ వ్యవహారంపై పర్యవేక్షణ మరింత కీలకంగా మారింది.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 1994లోనే జీవో జారీ చేసింది. పాఠశాలలు వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యాశాఖకు తెలియజేయాలన్నది ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఫీజుల విషయంలో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా.. వసూలు చేస్తున్న మొత్తాలపై ప్రభుత్వానికి సమాచారం ఉండేలా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే జీవో వచ్చి 32 ఏళ్లు గడిచినా.. దాని అమలు మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనలు ఉన్నా వాటి అమలును నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ బలహీనంగా ఉండటంతో సమస్య యథాతథంగా కొనసాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

900 బడులపై నిఘా ఏదీ?

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జిల్లాల్లో మొత్తం 900 ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో హనుమకొండ జిల్లాలో 333, వరంగల్‌ జిల్లాలో 261, మహబూబాబాద్‌లో 115, జనగామలో 82, భూపాలపల్లిలో 69, ములుగులో 40 పాఠశాలలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఉన్నప్పుడు వాటిలో ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ ఎంతమేరకు నిఘా పెడుతోందన్నది చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలు నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నాయా? వివరాలను నమోదు చేస్తున్నాయా? తల్లిదండ్రులకు పూర్తి సమాచారం ఇస్తున్నాయా? అన్న అంశాలపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే ఫిర్యాదు వచ్చినప్పుడు స్పందించడం కాకుండా.. ముందుగానే పర్యవేక్షించే విధానం ఎంతవరకు అమలవుతోందన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

వెబ్‌సైట్‌లో నమోదు తప్పనిసరి

ఫీజుల వసూళ్లలో పారదర్శకత కోసం పాఠశాలలు ఫీజుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఏ పాఠశాల ఎంత ఫీజు వసూలు చేస్తోంది? ఏ తరగతికి ఎంత ఫీజు నిర్ణయించింది? అనే వివరాలు అందుబాటులో ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. దీనివల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువుతున్న పాఠశాల ఫీజుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ వివరాలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయా? పాఠశాలలు వెబ్‌సైట్‌లో ఫీజుల వివరాలు నమోదు చేస్తున్నాయా? నమోదు చేసిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నాయా? అన్నది పరిశీలించాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయడం ఒక ప్రక్రియగా మిగిలిపోకుండా.. వాటి ఆధారంగానే వసూళ్లు జరుగుతున్నాయా లేదా అన్నది అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌లో ఒకటి.. వసూళ్లలో మరొకటి?

ఇదే ఇప్పుడు అసలు పరిశీలించాల్సిన అంశం. పాఠశాలలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయా? లేక అదనంగా మరేదైనా మొత్తాన్ని తీసుకుంటున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫీజుకు, తల్లిదండ్రులు చెల్లిస్తున్న మొత్తానికి తేడా ఉంటే.. ఆ అదనపు మొత్తం ఏ పేరుతో వసూలు చేస్తున్నారన్నది ప్రశ్న. ఫీజులతో పాటు ఇతర చార్జీలు ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఒక మొత్తం చూపిస్తూ.. వాస్తవంగా మరో మొత్తం వసూలు చేస్తున్నట్లయితే నిబంధనల ఉద్దేశమే నీరుగారిపోతుంది. అందుకే కేవలం వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారా లేదా అన్నది కాకుండా.. అందులో నమోదైన మొత్తాన్నే వసూలు చేస్తున్నారా లేదా అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

రసీదులే అసలు ఆధారం

ఫీజుల వసూళ్లలో తల్లిదండ్రులకు ఇచ్చే రసీదులు కీలక ఆధారాలు. పాఠశాలలు వసూలు చేస్తున్న మొత్తానికి రసీదు ఇస్తున్నాయా? అందులో ఫీజు వివరాలను స్పష్టంగా నమోదు చేస్తున్నాయా? వెబ్‌సైట్‌లో పేర్కొన్న మొత్తానికీ రసీదులో చూపిన మొత్తానికీ పొంతన ఉందా? అన్నది పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి బయటపడే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ వెబ్‌సైట్‌.. మరోవైపు పాఠశాల రసీదులు.. ఇంకోవైపు తల్లిదండ్రులు వాస్తవంగా చెల్లించిన మొత్తం.. ఈ మూడింటినీ సరిపోల్చితేనే ఫీజుల వ్యవహారంలో పారదర్శకత ఎంతవరకు ఉందో తేలుతుంది. 32 ఏళ్ల క్రితం రూపొందించిన నిబంధనలు ఇప్పటికీ అమలు కావాల్సిన అవసరం ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. నిబంధనలు పెట్టడంతోనే సరిపెట్టకుండా.. 900 ప్రైవేటు పాఠశాలల్లో అవి అమలవుతున్నాయా లేదా అన్నది విద్యాశాఖ పర్యవేక్షించాలి. ఫీజుల వివరాలు, వెబ్‌సైట్‌ నమోదు, రసీదులు, వాస్తవ వసూళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తేనే నిబంధనలకు సార్థకత చేకూరుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.