epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం
మేడారాన్ని ప్రపంచస్థాయి క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం
సాగునీరు, విద్య, వైద్యం, పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యం
రూ.16,007 కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రణాళిక
యువతకు విదేశీ భాషల్లో ఉచిత శిక్షణ
ములుగు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రూ.63.50 కోట్లతో నూతన కలెక్టరేట్‌ ప్రారంభం
ములుగుకు అభివృద్ధి హామీల వెల్లువ
మహిళల సంక్షేమానికి పెద్దపీట : మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, ఉపాధి, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మేడారం ఆధ్యాత్మిక, గిరిజన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి చేస్తామని, మల్లూరు నరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. జంపన్నవాగును సమగ్రంగా అభివృద్ధి చేసి అవసరమైన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాలు నిర్మిస్తామని వెల్లడించారు. ములుగు యువతకు జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో ఉచిత శిక్షణ అందించి అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు జిల్లాకు కీలక హామీలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో 2,145 గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే ప్రణాళికను ములుగు నుంచి ప్రారంభించారు. రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

వనదేవతలకు ప్రత్యేక పూజలు

కామారెడ్డి జిల్లా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్న ఆయనకు గిరిజన పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. వనదేవతలను దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తన మొక్కులో భాగంగా తులాభారంలో 66 కిలోల నిలువెత్తు బంగారం బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం పూజారులు సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మేడారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శుద్ధ తాగునీటి కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

మేడారానికి ప్రపంచస్థాయి గుర్తింపు

మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంతాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో విశిష్టంగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. మేడారం ఆధ్యాత్మికతతోపాటు గిరిజన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని, ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు మల్లూరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేడారం భక్తుల సౌకర్యాలు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్నవాగును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, అవసరమైన చోట్ల చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాలు నిర్మిస్తామని తెలిపారు. గోదావరి తీర ప్రాంతమైన ములుగులో సాగునీటి కొరత లేకుండా చేయడానికి అవసరమైన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

రహదారులతో గ్రామాలకు మెరుగైన అనుసంధానం

ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో 2,145 గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం కల్పించడమే ఈ ప్రణాళిక లక్ష్యంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రయోజనం కలగనుంది.

రూ.63.50 కోట్లతో నూతన కలెక్టరేట్‌

రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ములుగు జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందనున్నాయి. కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. జిల్లాలో చేపట్టిన సుమారు రూ.868 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పరిశీలించారు. త్వరలో జిల్లా ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

యువతకు అంతర్జాతీయ అవకాశాలు

ములుగు జిల్లా యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని సీఎం తెలిపారు. జర్మనీ, జపాన్‌, కొరియా దేశాల్లోని ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో ఉచిత శిక్షణతోపాటు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్‌ బోధన అందించడంతోపాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు, స్కిల్‌ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా యువతలో ఆధునిక నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం అందుబాటులోకి రావడం ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు.

చేయూత పింఛన్ల పంపిణీ

మేడారం ఆలయ ప్రాంగణంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాలు, చెక్కులను సీఎం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో సీఎం ముచ్చటించి వారి ఉపాధి కార్యక్రమాలు, ఆర్థికాభివృద్ధి గురించి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. పూజారులు, డోలు వాయిద్య కళాకారులతోనూ మాట్లాడారు.

మహిళలకు ‘సారె’ చీరలు

మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సమ్మక్క–సారలమ్మ బిడ్డలకు ‘సారె’ పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మహిళలకు చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క పర్యవేక్షణలో చీరల ఎంపిక, రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి 5,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సాగునీటి రంగంలో రూ.200 కోట్లతో పొట్లపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధి అభివృద్ధితోపాటు విద్య, వైద్యం, పర్యాటకం, గృహ నిర్మాణం, సాగునీరు, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన పనులకు ప్రజా ప్రభుత్వం నిధులు విడుదల చేసి ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ములుగు ప్రాంతాన్ని హైదరాబాద్‌ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారం, ములుగు ప్రాంతాల్లో భారీగా ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎంపీలు బలరాం నాయక్‌, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ రామచంద్ర నాయక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయని రాజేందర్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్‌, మందుల సామేలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, జిల్లా అటవీ అధికారి వికాస్‌ మీనా, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, సెర్ప్‌ సీఈఓ దివ్య, మేడారం ఈఓ వీరస్వామి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.