epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖ‌మ్మంలో తుమ్మల అరాచకాలు

ఖ‌మ్మంలో తుమ్మల అరాచకాలు
మంత్రి, ఆయన కుమారుడి అండతో మైనింగ్‌, భూ దందాలు
గతంలో నాపై ప్రచారం చేసినవారే ఇప్పుడు తుమ్మల వెంట
ఖమ్మం అభివృద్ధిపై తుమ్మల శ్వేతపత్రం విడుదల చేయాలి
సీతారామ ప్రాజెక్టులో నాణ్యత డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతోంది..!
కేసీఆర్‌ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్‌ క్రెడిట్‌ కొట్టేస్తోంది
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శ‌లు

కాకతీయ, ఖమ్మం టౌన్‌: ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి తుమ్మల, ఆయన కుమారుడి అండతో ఇసుక, మట్టి, భూ అక్రమాలు సాగుతున్నాయని ఆరోపించారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులే ఇప్పుడు తుమ్మల వెంట తిరుగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి పరిధిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి, ఆయన కుమారుడి అండతో కొందరు ఇసుక, మట్టి, భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పువ్వాడ ప్రశ్నించారు. గతంలో తనపై తీవ్ర ఆరోపణలు చేసినవారే ఇప్పుడు అధికార పార్టీ నేతల చుట్టూ చేరి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం అండగా ఉంటే ఏం చేసినా చెల్లుతుందన్న పరిస్థితి ఖమ్మంలో నెలకొన్నదా? అని నిలదీశారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పార్టీని వీడలేదని, పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, తమపై జరుగుతున్న ప్రతి దానికి తగిన సమాధానం చెబుతామని అన్నారు.

ఖమ్మానికి తుమ్మల చేసిందేమిటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే ప్రత్యేకమైన పని ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా మంత్రి పదవులు అనుభవించారని, కానీ ఖమ్మం అభివృద్ధికి ఆయన చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. తాను ఇకముందూ ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని పువ్వాడ స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సోషల్‌ మీడియాలో తన పేరు కనిపిస్తే కొందరు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయని పువ్వాడ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఏడాదికే కాలువ సీసీ లైనింగ్‌ దెబ్బతినడం ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాధనంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్తులో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

కేంద్రం రోడ్డుకు.. క్రెడిట్‌ ఎవరిది?

దేవరపల్లి–ఖమ్మం జాతీయ రహదారి విషయంలోనూ మంత్రి తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారికి రాష్ట్ర మంత్రి క్రెడిట్‌ తీసుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మున్నేరుపై తీగల వంతెన, రక్షణ గోడలు, ఇంజినీరింగ్‌ కాలేజీ నిర్మాణాలకు కేసీఆర్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పువ్వాడ తెలిపారు. వాటికి నిధులు విడుదల చేసి, జీవోలు జారీ చేసింది నాటి ప్రభుత్వమేనన్నారు. మున్నేరు వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు. ఖమ్మం బస్‌స్టాండ్‌ నిర్మాణం, గోళ్లపాడు చానల్‌ అభివృద్ధి వంటి పనులు కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం వేసిన పునాదులపై పనులు కొనసాగిస్తూ.. వాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రెడిట్‌ కొట్టేస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలన అట్టర్‌ఫ్లాప్‌ సినిమా మాదిరిగా మారిందని పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.