మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్
కాకతీయ, జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని గ్రామంలో మరింత బలోపేతం చేస్తానన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, వారి సమస్యలను ఉన్నత నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

