జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హరీష్‌కు అవార్డు
ఏపీ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీ
మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ చేతుల మీదుగా హరీష్‌కు అవార్డు
కాకతీయ, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీలో అవార్డుకు ఎంపికైన చిత్రానికి ఫొటో జర్నలిస్ట్ హరీష్ పురస్కారం అందుకున్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ చేతుల మీదుగా హరీష్ అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయి పోటీలో తన చిత్రం అవార్డుకు ఎంపిక కావడం పట్ల హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిజంలో ఫొటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ నిర్వహించే ఇలాంటి పోటీలు ఫొటో జర్నలిస్టుల్లో మరింత సృజనాత్మకతను పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అవార్డు అందుకున్న హరీష్‌ను పలువురు జర్నలిస్టులు, సహచరులు అభినందించారు.

