నిజామాబాద్ అర్బన్‌లో ఎస్‌ఐఆర్ ఫేజ్-2 కార్యక్రమం
ఓటరు జాబితా, ఏఎస్‌డీడీ డేటా సేకరణపై దృష్టి
కొత్త అర్హులైన ఓటర్లను గుర్తించి ఫారం-6 నమోదు
ఆగస్టు 27న గ్రామ, వార్డు సభల్లో పాల్గొనాలని పిలుపు
ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి సూచన
కాకతీయ, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డీసీసీ టౌన్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఫేజ్-2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఫేజ్-1లో సక్రమంగా పనిచేయని సూపర్‌వైజర్లు, బీఎల్‌ఏల స్థానంలో కొత్తవారిని నియమించాలని సూచించారు. ఎలక్టోరల్ రోల్, ఏఎస్‌డీడీ డేటాను సేకరించి బీఎల్‌ఏలకు అందజేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి ఫారం-6 ద్వారా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 27న జరిగే గ్రామ, వార్డు సభల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు.

