సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటు
రైతు ఉద్యమానికి అంకితమైన నేతగా సేవలు
సీపీఎం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటు
మల్లారెడ్డితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కడియం
గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోవడం బాధాకరం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, హైదరాబాద్ : రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమానికి తీరని లోటని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో మల్లారెడ్డి భౌతికకాయానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం జీవితాంతం పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. 1987లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ప్రోత్సహించిన వారిలో మల్లారెడ్డి ముఖ్యులని గుర్తుచేశారు. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని తెలిపారు. మల్లారెడ్డి మరణం సీపీఎం పార్టీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కూడా తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

