epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా..

రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా..
కాకతీయ కథనంపై తహసీల్దార్‌ నిర్లక్ష్యపు సమాధానం!
‘మా పరిధిలోకి రాదు’ అంటూ రెవెన్యూ అధికారి దాటవేత
గతంలో జీపీఏ లేఅవుట్‌ చేసి ఉంటే కోర్టు స్టేతో రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చన్న తహసీల్దార్‌
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్న వ్యవసాయ శాఖ

కాకతీయ, గీసుగొండ : రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉండి.. క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ కోరితే బాధ్యతను మరో శాఖపైకి నెట్టడం రెవెన్యూ అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ‘రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా!’ అనే శీర్షికన కాకతీయ దినపత్రికలో ఈ నెల 3న ప్రచురితమైన కథనంపై గీసుగొండ తహసిల్దార్‌ ఎం.డి. రియాజుద్దీన్‌ను వివరణ కోరగా.. భూమి వ్యవసాయేతర వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రికార్డుల్లో భూమి స్వరూపం, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సదరు భూమికి రైతుబంధు ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడనే ఆరోపణలు ఉండటంతో తహసిల్దార్‌ స్పందనపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

కోర్టు స్టేతో రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చు

భూమికి సంబంధించి గతంలో జీపీఏ ద్వారా లేఅవుట్‌ చేసి ఉంటే, సదరు భూమికి సంబంధించిన నిర్వాసితులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్‌ తెచ్చుకుంటే.. తమ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయకుండా అడ్డుకోవచ్చని తహసిల్దార్‌ ఎం.డి. రియాజుద్దీన్‌ తెలిపారు. భూమి హక్కులు, రిజిస్ట్రేషన్ల విషయంలో న్యాయపరమైన ఆదేశాలు ఉంటే వాటి ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

‘పరిశీలనలో తేలితే చర్యలు’.. వ్యవసాయ శాఖ స్పష్టీకరణ

ఇదే విషయంపై మండల వ్యవసాయ అధికారి వి. హరి ప్రసాద్‌ బాబును వివరణ కోరగా.. కాకతీయ కథనంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతామని తెలిపారు. సదరు భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలితే రైతుబంధు పథకం ప్రయోజనాలను నిలిపివేయడంతో పాటు, ఇప్పటివరకు పథకం ద్వారా పొందిన నిధులను నిబంధనల మేరకు రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల స్పందనల నేపథ్యంలో ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు ఏమిటన్నది అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనతో వెలుగులోకి రావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.