epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు దుర్మార్గం

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు దుర్మార్గం
కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి
తాత మ‌ధుపై బీఆర్ ఎస్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమే
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి

కాకతీయ, హనుమకొండ : శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు తాతా మధు తక్షణమే స్పీకర్‌కు, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హసన్‌పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేణిగుంట్ల అశోక్‌, డివిజన్‌ అధ్యక్షులు నేదునూరి సునీల్‌, పుట్ట తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమానికి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా బాధ్యతారహితంగా మాట్లాడటం బీఆర్‌ఎస్‌ నేతల అహంకారానికి నిదర్శనమని ఇనగాల మండిపడ్డారు. స్పీకర్‌ పదవిని అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం మాత్రమే కాదని, మొత్తం రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉన్నందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు రావడం లేదని, అదే సమయంలో ఆయన పార్టీ నాయకులు బయటకు వచ్చి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఇనగాల విమర్శించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసినా కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి

తాతా మధుపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇనగాల డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఆయనను సస్పెండ్‌ చేసి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బాల్మంచ్‌ అధ్యక్షుడు జిన్నపురెడ్డి రుగ్వేద్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కిరణ్‌, సురేందర్‌రెడ్డి, ఐలయ్య, డీసీసీ నాయకులు బుచ్చిరెడ్డి, రవీందర్‌, మధు, సురేష్‌, రాజు, వెంకన్న, మహిళా నాయకురాలు పల్లెపు అనూష తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రెవెన్యూ పట్టా,...

చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు

చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు విద్యుత్ ప్రమాదంలో జీవితం అతలాకుతలం రూ.25 లక్షల నుంచి...

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.