తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి
దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం
కక్షసాధింపు వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి డిమాండ్
కాకతీయ, శంకరపట్నం: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం కేశవపట్నం అంబేద్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తాతా మధును వెంటనే శాసనమండలి నుంచి సస్పెండ్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్లు గోపగోని బసువయ్య, కిసార సంపత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టే మధు, దేవస్థానం చైర్మన్ ఉప్పుగండ్ల మల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ షారుఖ్, ఎస్సీ జిల్లా కార్యదర్శులు చంద్రమౌళి, సంపత్, సర్పంచులు కర్కా చంద్రశేఖర్, మారావేణి రాజయ్య, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

