ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి
ఘనంగా జూనియర్ కళాశాలల లాన్ టెన్నిస్ సెలక్షన్స్
కాకతీయ,హన్మకొండ : వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జూనియర్ కళాశాలల విద్యార్థుల లాన్ టెన్నిస్ అండర్-19 సెలక్షన్స్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు హనుమకొండ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సెలక్షన్స్ దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, లాన్ టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ పాఠశాలల క్రీడా కార్యదర్శి వాసుదేవరావు, ఫిజికల్ డైరెక్టర్లు సతీష్, రామ్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, సిరికొండ సుదర్శన్, వెంకట్, వినీల్, మల్లయ్య, శ్రీనివాస్, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన క్రీడాకారులు సెలక్షన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

