మానాల గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా జక్కుల శ్రీనివాస్
కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం మానాల గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా జక్కుల శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా చెదలు నవీన్, రెండో వైస్ చైర్మన్‌గా బాధవత్ రవి, కార్యదర్శిగా నాంచారి రాకేష్ ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సమష్టిగా కృషి చేస్తామని నూతన చైర్మన్ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. నూతన కార్యవర్గాన్ని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

