epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

రుద్రంగిలో కొత్తగా 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ..

మండలంలో ఇప్పటికే 2,275 మందికి వివిధ రకాల పెన్షన్లు..

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి భరోసా.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..

కాకతీయ, రుద్రంగి :పేదల కన్నీళ్లు తుడిచి.. వారి జీవితాల్లో భరోసా నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూసిన నిరుపేదలకు ఆర్థిక అండ అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రుద్రంగి మండలకేంద్రంలో నూతనంగా మంజూరైన 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. మండలంలో ఇప్పటికే 2,275 మందికి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయని వెల్లడించారు. అనారోగ్యం, దివ్యాంగత్వం, వృద్ధాప్యం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు పెన్షన్ ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. గత మూడు రోజులుగా వేములవాడ, చందుర్తి, మేడిపల్లి ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ సంకల్పమన్నారు.

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. రుద్రంగి మండలానికి కూడా ఇళ్లు మంజూరు చేశామని, ఇంటి స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సర్పంచ్ గండి నారాయణ, ఎంపీడీవో నటరాజ్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఫ్యాక్స్ చైర్మెన్ ఏగోళం శ్రీనివాస్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి, రిటైర్డ్ ఏడిఈ లక్ష్మణ్ నాయక్, భూక్యా జవహర్‌ లాల్ నాయక్, నాయకులు గడ్డం శ్రీనివాస్, గసికంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు...

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే...

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న...

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు...

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ డిసెంబర్ 27న కరీంనగర్‌లో...

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం పోలీస్‌స్టేషన్ నూతన...

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్‌...

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌ కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.