కేసముద్రం మున్సిపాలిటీ అంబరానంటిన దసరా ఉత్సవాలు
కాకతీయ కేసముద్రం : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో దసరా ఉత్సవాల్లో పోటాపోటీగా చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకునే విజయదశమి ( దసరా పండుగ) స్థానిక మున్సిపాలిటీలో నువ్వా నేనా అని రెండు చోట్ల స్థానిక (R&B) పొట్టి శ్రీరాములు సర్కిల్ మరియు జ్యోతిరావు పూలే సెంటర్ రెండు చోట్ల వేరే వేరేగా రావణ వధ వేడుకలు నిర్వహించుతున్నారు ముందుగా స్థానిక రామ మందిరం లో పూజలు నిర్వహించి తరువాత గ్రామం నడి ఒడ్డున ఉన్న బొడ్డు రాయికి కొబ్బరికాయ కొట్టి,జమ్మి చెట్టుకి పూజలు నిర్వహించి రావణ వధ కార్యక్రమం ఈ రెండు చోట్ల వార్డ్ కౌన్సిలర్,పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పోటాపోటీగా రావనవధ ఏర్పాటు చేయటం జరిగినది.

