epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అదుపు తప్పుతున్న బోర్ల తవ్వకాలు!

అదుపు తప్పుతున్న బోర్ల తవ్వకాలు!
పంటను కాపాడుకునే ఆరాటంలో అప్పుల ఊబిలో అన్నదాత
*నర్సంపేట డివిజన్‌లో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు*

– రూ.50 వేల నుంచి లక్ష వరకు తవ్వకాల ఖర్చు
– నీళ్లు పడకపోతే రైతు కంట కన్నీరే!
– ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి బోర్ల తవ్వకాలు
– అనుమతులు, నిబంధనల అమలుపై పర్యవేక్షణ ఏదీ?
– భూగర్భ జలాలు అడుగంటుతున్నా పట్టించుకోని యంత్రాంగం
– బోర్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతుల వేడుకోలు

కాకతీయ,నల్ల బెల్లి : ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కాపాడుకోవాలనే ఆరాటం అన్నదాతను అప్పుల ఊబిలోకి నెడుతోంది. నర్సంపేట డివిజన్ పరిధిలో బోర్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భూమిలో నీళ్లు పడతాయో లేదో తెలియని పరిస్థితుల్లోనూ రైతులు అప్పులు చేసి మరీ బోర్లు వేయిస్తున్నారు. కొందరి పొలాల్లో నీటి జాడ కనిపిస్తుండగా, మరికొందరి పొలాల్లో లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడక రైతుల కళ్ల వెంట కన్నీరు కారుతోంది. పంటను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే చివరకు రైతుకు ఆర్థిక భారంగా మారుతోంది.

బోరు పడితే నీళ్లు.. పడకపోతే కన్నీళ్లు!

డివిజన్ పరిధిలో ఒక్కో బోరు తవ్వకానికి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నీళ్లు పడిన తర్వాత మోటారు, పైపులు, విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రి కోసం అదనంగా మరో లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా నీళ్లు పడకపోతే అప్పు మాత్రం మిగులుతోంది. ఒక రైతు పొలంలో బోరు విజయవంతమైతే పక్క రైతు కూడా అదే ఆశతో అప్పు చేసి బోరు వేయిస్తున్నాడు. ఇలా ఒకరిని చూసి మరొకరు బోర్ల తవ్వకాలకు మొగ్గుచూపుతుండటంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతోంది.

కొబ్బరికాయలు.. మిషన్లు.. యంత్రాలతో నీటి అన్వేషణ!

భూమిలో నీటి జాడ తెలుసుకునేందుకు కొందరు కొబ్బరికాయల పద్ధతిని నమ్ముకుంటుండగా, మరికొందరు ఆధునిక మిషన్లు, ఇతర పరికరాలను ఆశ్రయిస్తున్నారు. ఎవరి నమ్మకం వారిది.. ఎవరి ప్రయత్నం వారిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అయితే ఏ పద్ధతిలో పరిశీలించినా భూగర్భంలో నీరు కచ్చితంగా లభిస్తుందనే హామీ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఎండిపోతుందనే భయంతో మరో మార్గం లేక బోర్ల తవ్వకాలకు సిద్ధమవుతున్నారు.

అనుమతుల సంగతి ఏమిటి?

బోర్ల తవ్వకాలకు సంబంధించి నిబంధనలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు ఎంతవరకు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే బోర్లు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోర్లు వేసిన వెంటనే విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి మోటార్లను వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్ల మంజూరు, లోడ్, సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల పర్యవేక్షణ అవసరమని రైతులు కోరుతున్నారు.

భూగర్భ జలాలకు పొంచి ఉన్న ముప్పు!

ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు కొనసాగితే భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బోర్లు వేయడం వల్ల ఇప్పటికే ఉన్న బోర్లలో నీటి లభ్యత తగ్గే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాల పరిరక్షణ గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తవ్వకాల నియంత్రణకు తగిన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చట్టాలున్నా అమలెక్కడ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే భూగర్భ జలాల పరిరక్షణ, బోర్ల తవ్వకాల నియంత్రణ కోసం వాల్టా చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే సంబంధిత నిబంధనల అమలు, అనుమతుల పరిశీలన, అక్రమ తవ్వకాలపై చర్యల విషయంలో అధికారులు ఎంతవరకు దృష్టి సారిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బోర్ల తవ్వకాలపై సమగ్ర పర్యవేక్షణ లేకపోతే భవిష్యత్తులో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంటను కాపాడుకోవాలా.. అప్పులు తీర్చాలా?

పంట చేతికొస్తే అప్పులు తీరుతాయనే ఆశతో రైతులు బోర్ల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ నీళ్లు పడకపోతే బోరు ఖర్చుతో పాటు పంట పెట్టుబడి కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక బోరు విఫలమైతే మరో బోరు వేయించేందుకు ప్రయత్నిస్తున్న రైతులు సైతం ఉన్నారు. దీంతో పంటను కాపాడుకోవాలనే తాపత్రయం చివరకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.

ఇప్పటికైనా స్పందించరా?

బోర్ల తవ్వకాలను కేవలం నియంత్రించడమే కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాల లభ్యతపై గ్రామాలవారీగా అవగాహన కల్పించడం, అనుమతుల ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడం, అక్రమ తవ్వకాలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పంటను కాపాడుకునేందుకు అప్పులు చేస్తున్న అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలవాలని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

*నేడు పంట కోసం భూమిని చీలుస్తున్న రైతుకు.. రేపు తాగేందుకు నీరైనా మిగులుతుందా? అన్న ప్రశ్నకు పాలకులు, అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.*

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.