epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భగీరథిపేట ప్రాజెక్టులో లంచం బాగోతం!

భగీరథిపేట ప్రాజెక్టులో లంచం బాగోతం!
భూపాల‌ప‌ల్లిలో ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, టెక్నిక‌ల్ అసిస్టెంట్ రాజు అరెస్టు
రూ.39.17 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తింపు
బిల్లుల చెల్లింపులు, కొత్త పనుల కేటాయింపునకు లంచం డిమాండ్‌
వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీబీ డీఎస్పీ సాంబ‌య్య‌

కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భగీర‌థిపేట ప్రాజెక్టుకు చెందిన ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన–2.0 పథకం కింద చేపట్టిన పనుల బిల్లుల ప్రాసెసింగ్‌, తదుపరి పనుల కేటాయింపునకు కాంట్రాక్టర్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై వ‌రంగ‌ల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబ‌య్య ఆధ్వ‌ర్యంలో సోదాలు నిర్వ‌హించారు. ఈ మేరకు ఏసీబీ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించింది. ఏసీబీ ప్రకటన ప్రకారం.. భగీరథిపేట ప్రాజెక్టు అధికారి సతీశ్‌ రెడ్డి, సాంకేతిక అధికారి రాజు కాంట్రాక్టర్‌ నుంచి బిల్లుల మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు అక్రమంగా డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు అందింది. కోరిన మొత్తం చెల్లించకపోతే పెండింగ్‌ బిల్లులు ప్రాసెస్‌ చేయబోమని, తదుపరి పనులు కేటాయించబోమని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.39.17 లక్షల లావాదేవీలపై విచారణ

ఏసీబీ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం రూ.39,17,000 వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లావాదేవీలు నిందితుల సూచనల మేరకు జరిగినట్లు ఫిర్యాదుదారు ఆరోపించినట్లు తెలిపింది. దీనికి మద్దతుగా బ్యాంకు స్టేట్‌మెంట్లు, వాట్సాప్‌ చాట్‌ రికార్డులను కూడా అందించినట్లు పేర్కొంది. అదనంగా, ఏడో బిల్లుకు సంబంధించిన మొత్తంలో మరో 25 శాతం చెల్లించాలని సతీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ ప్రకటన వెల్లడించింది. పనుల కొలతల నమోదు, పెండింగ్‌ బిల్లుల ప్రాసెసింగ్‌తో ఈ డిమాండ్‌కు సంబంధం ఉన్నట్లు తెలిపింది. ఆధారాలు, సంబంధిత అధికారుల అనుమతి ఆధారంగా అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్లు 7(ఎ), 7(బి), 13(1)(బి)తోపాటు 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబ‌య్య మీడియాకు వెల్ల‌డించారు. సతీశ్‌ రెడ్డి, రాజులను అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.