epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!
మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల
వెయ్యి మంది వరకు బాధితులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి
రూ.25 లక్షల వసూళ్లపై ప్రాథమికంగా గుర్తింపు

కాకతీయ, హైదరాబాద్‌: మహిళల పేర్లతో నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు సృష్టించి హనీట్రాప్‌ ద్వారా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన సైబర్‌ నేరగాడు పవన్‌కుమార్‌ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ వలలో హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఏసీపీ, మరో ఇన్‌స్పెక్టర్‌ కూడా చిక్కినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు సమాచారం. పవన్‌కుమార్‌ తన మాజీ ప్రియురాలి సహకారంతో ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. అందమైన యువతుల ఫొటోలతో 13 ఇన్‌స్టాగ్రామ్‌, 14 ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించి వందలాది మందితో పరిచయాలు పెంచుకున్నాడు. చాటింగ్‌ ద్వారా బాధితులను లైంగిక సంభాషణల వైపు మళ్లించి, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించేవాడని సమాచారం. అవసరమైన సందర్భాల్లో ఫోన్‌లో యువతిగా మాట్లాడేందుకు మాజీ ప్రియురాలి సాయం తీసుకునేవాడని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతరం మార్ఫింగ్‌ చేసిన చిత్రాలు, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు పంపి, వాటిని బయటపెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో 82 మంది బాధితులను గుర్తించి, వారి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తేలిందని తెలుస్తోంది. మొత్తం బాధితుల సంఖ్య వెయ్యి వరకు ఉండవచ్చని, వసూళ్లు కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దుబాయ్‌, టర్కీ, పాకిస్థాన్‌, కెనడాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందినవారు బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. వైద్యులు, అధ్యాపకులు, ప్రైవేటు ఉద్యోగులు, గిగ్‌ వర్కర్లతో పాటు తన స్నేహితులను కూడా నిందితుడు మోసగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు...

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.