పట్టభద్రుల నమోదు వేగవంతం చేయాలి!
అర్హులైన ప్రతి పట్టభద్రుడి నమోదు పూర్తిచేయాలి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ
మడికొండలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం పరిశీలన
కాకతీయ, కాజీపేట : నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా నమోదు చేయించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ రాష్ట్ర కో-ఇన్‌చార్జి డాక్టర్ వన్నాల వెంకటరమణ సూచించారు. మడికొండలో జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన వివరాలు, నమోదు పురోగతి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు కీలకమని, అర్హులైన ఒక్క పట్టభద్రుడి వివరాలు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని వన్నాల వెంకటరమణ అన్నారు. పట్టభద్రులను నేరుగా సంప్రదించి, అవసరమైన వివరాలు సేకరించి, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ జిల్లా కో-కన్వీనర్ త్రిలోకేశ్వర్‌రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు గడ్డం మహేందర్, మడికొండ కన్వీనర్ మిట్టపల్లి హేమంత్, చెన్న బోయిన శివకుమార్, నాయిని కుమార్, మారం రాము యాదవ్, దార ధనుంజయ్, తాడేం రంజిత్, గుండాల కళ్యాణ్, అన్నందాస్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

