epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూ భకాసురులకు అండగా పాలకులు

భూ భకాసురులకు అండగా పాలకులు
వైఎస్సార్‌ నగర్‌ పేదలకు పట్టాలిచ్చి.. పక్కా ఇళ్లు నిర్మించాలి
మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు భరోసా కల్పించాలి
సర్వే నంబర్లు 70, 71, 72లో భూ రికార్డుల మార్పులు
భూ రికార్డుల మార్పుపై ప్ర‌భుత్వం సమగ్ర విచారణ జరపాలి
బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌
కాంగ్రెస్‌ నాయకులే గుడిసెలు వేయించి.. ఇప్పుడు కూల్చుతున్న‌రు
కడియం శ్రీహరి ఇచ్చిన హామీ ఏమైంది? : మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌
గుడిసెవాసుల‌తో క‌ల‌సి కాజీపేట‌ ఎంఆర్వో కార్యాలయం వరకు బీఆర్ఎస్‌, ప్రజాసంఘాల ర్యాలీ

కాకతీయ, హ‌న్మ‌కొండ : “పేదల గుడిసెలు కూల్చడం కాదు.. వారికి పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలి. పథకాల పేర్లు మార్చడం కాదు.. పేదల బతుకులు మార్చాలి. మూడు నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదల కడుపుకొట్టే ప్రయత్నాలను సహించేది లేదు. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు బీఆర్ఎస్‌ పార్టీ అండగా ఉంటుంది.. వారి హక్కుల కోసం పోరాడుతుంది” అని పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బీఆర్ఎస్‌ పార్టీ, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తా నుంచి ఎంఆర్వో కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన నిర‌స‌న‌లో నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, పేదల నివాసాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

మూడు దశాబ్దాలుగా నివాసం..

వైఎస్సార్‌ నగర్‌లోని పేదలు దాదాపు మూడు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వినోద్‌కుమార్‌ తెలిపారు. ఇక్కడి ప్రజలు కేవలం తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నవారు కాదని, తరతరాలుగా ఇదే ప్రాంతాన్ని తమ జీవనాధారంగా చేసుకున్నారని పేర్కొన్నారు. కాలనీలో దేవాలయాలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రహదారులు, విద్యుత్‌ దీపాలు, తాగునీటి నల్లాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజలు ఇన్నేళ్లుగా నివసిస్తూ, ప్రభుత్వ సదుపాయాలు వినియోగించుకుంటున్న ప్రాంతంలో ఇప్పుడు గుడిసెల తొలగింపు ప్రయత్నాలు జరగడం ఆందోళనకరమన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి పట్టాలు అందించామని, అదే విధంగా వైఎస్సార్‌ నగర్‌ పేదలకు కూడా పట్టాలు ఇచ్చి వారి నివాసాలకు భద్రత కల్పించాలని కోరారు. స్థలంపై ఉన్న వివాదాన్ని సాకుగా చూపి నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేయడం తగదని, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించి పేదలకు న్యాయం చేయాలని సూచించారు.

సీలింగ్‌ భూమి రికార్డుల్లో మార్పులెందుకు?

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులు నివసిస్తున్న స్థలం వాస్తవంగా అర్బన్‌ సీలింగ్‌ భూమి అని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సర్వే నంబర్లు 70, 71, 72లకు సంబంధించిన భూమి రికార్డుల్లో మార్పులు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భూమి అసలు స్వరూపం ఏమిటి? గతంలో ప్రభుత్వ రికార్డుల్లో ఎలా నమోదైంది? ప్రస్తుతం ఎవరి పేర్లపై ఉంది? ఏ ప్రాతిపదికన మార్పులు జరిగాయి? అనే అంశాలను అధికారులు పరిశీలించాలని కోరారు. పాత రికార్డులు, ప్రస్తుత రెవెన్యూ వివరాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను సమన్వయం చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. భూమి వివాదం పేరుతో పేదల గుడిసెలను తొలగించే ప్రయత్నాలు ఆపాలని, ముందుగా యాజమాన్యంపై స్పష్టత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. భూమి వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌ నాయకులే గుడిసెలు వేయించారు..

దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులే గతంలో వైఎస్సార్‌ పేరుతో కాజీపేటలో పేదలకు గుడిసెలు ఏర్పాటు చేయించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆ గుడిసెలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “పథకాల పేర్లు మార్చుడు కాదు.. పేదల బతుకులు మార్చాలి. లిల్లీపుట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి కూల్చివేతలు ఆపి, పేదలకు నిర్మాణాలు చేపట్టాలి. భూ కబ్జాదారులతో నీ డీల్‌ ఎంత? భూ కుంభకోణంలో నీ వాటా లేకుంటే పేదలకు అండగా నిలువు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన నిలబడతానని, వారి పొట్టకొట్టే ప్రయత్నాలను సహించబోనని స్పష్టం చేశారు. కొందరు నాయకులు తనపై చిల్లర విమర్శలు చేస్తున్నారని, వ్యక్తిగత విమర్శలతో సమస్య పరిష్కారం కాదని, దమ్ముంటే ప్రజల తరఫున పోరాటానికి రావాలని సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ నగర్‌ పేదల సమస్యను రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, వారికి పట్టాలు, పక్కా ఇళ్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కడియం శ్రీహరి ఇచ్చిన హామీ ఏమైంది?

వైఎస్సార్‌ నగర్‌ భూమిలో బస్టాండ్‌ నిర్మాణం కోసం సుమారు 30 ఏళ్ల క్రితం దివంగ‌త‌ ప్రణయ్‌ భాస్కర్‌, విజయరామారావు, కడియం శ్రీహరి ప్రతిపాదనలు పంపారని వినయ్‌ భాస్కర్‌ గుర్తుచేశారు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో తాను, అప్పటి ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి కలిసి ప్రచారంలో పాల్గొని గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారని, గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. “కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన కడియం శ్రీహరి గారూ.. వైఎస్సార్‌ నగర్‌ పేదల సమస్య మీకు పట్టదా? నాడు ఇచ్చిన హామీ, మీ కమిట్‌మెంట్‌ ఎక్కడికి పోయింది?” అని నిలదీశారు. రాజకీయంగా ఎన్ని మార్పులు జరిగినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని వ్యాఖ్యానించారు.

పోలీసుల బెదిరింపులపై ఆగ్రహం

వైఎస్సార్‌ నగర్‌ సమీపంలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా వచ్చాయని వినయ్‌ భాస్కర్‌ ప్రశ్నించారు. అనుమతుల మంజూరులో అనుసరించిన విధానం, సంబంధిత దరఖాస్తులు, అధికారుల నిర్ణయాలపై వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో తమకు మద్దతుగా నిలుస్తున్న నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, వినయ్‌ భాస్కర్‌కు తోడుగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నట్లు తమ నాయకులు చెబుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి పోరాడామని, అలాంటి తమను బెదిరింపులతో ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరి అండ చూసుకొని అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క గుడిసెవాసి కూడా భయపడవద్దని, వారి పక్షాన తాను నిలబడి పోరాటం కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు.

దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం నాయకులు కారు ఉపేందర్‌, సాంబయ్య, జనసేన నాయకురాలు పద్మజ, పూలే సంఘం నాయకుడు కేడల ప్రసాద్‌, డీబీఎఫ్‌ నాయకుడు మాదాసు సురేష్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పాలకులు పేద ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, బడాబాబులకు, భూ భకాసురులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. గుడిసెవాసులపై దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు పేదలకు రక్షణగా నిలవాలని కోరారు. భూమి వివాదం పేరుతో నిరుపేదలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని, వారి నివాస హక్కులకు భంగం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. మాకు పట్టాలివ్వాలి’

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసి నీరటి పావని మాట్లాడుతూ.. తమ కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా కాజీపేట పట్టణంలోని వైఎస్సార్‌ నగర్‌లోనే నివసిస్తున్నాయని తెలిపారు. “ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మాకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరింపులు మొదలయ్యాయి. మా గుడిసెలపైకి జేసీబీలు వస్తున్నాయి. కొందరి నుంచి మాకు ప్రాణహాని ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా నివసిస్తున్న తమను ఖాళీ చేయించకుండా, భూమిపై ఉన్న వివాదాన్ని పరిష్కరించి తమకు శాశ్వత నివాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎంఆర్వో కార్యాలయం వద్ద బైఠాయింపు..

కాజీపేట చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎంఆర్వో కార్యాలయానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినోద్‌కుమార్‌, వినయ్‌ భాస్కర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం నేతలు వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులను ఉద్దేశించి మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అధికారులు నిరసనకారుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని, పేదల నివాసాలకు భద్రత కల్పించాలని, గుడిసెలు కూల్చే ప్రయత్నాలను నిలిపివేయాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యుడు నార్లగిరి రమేష్‌, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, సోదా కిరణ్‌, తండమల్ల వేణు, జోరిక రమేష్‌, ఉడతల సారంగపాణి, వద్దిరాజ్‌ గణేష్‌, మేకల బాబురావు, డివిజన్‌ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్‌, రంజిత్‌, పున్నం చందర్‌, దువ్వ కనకరాజు, కోటిలింగం, మనోజ్‌, కొండ శ్రీను, ఖలీల్‌, ఆర్టీఏ మాజీ సభ్యుడు కాటాపూర్‌ రాజు, సీనియర్‌ నాయకులు సుంచు కృష్ణ, రామ్మూర్తి, మర్యాల కృష్ణ, నయీంజుబేర్‌, అఫ్జల్‌, యాదగిరి, రఘు, ప్రభాకర్‌, ఎస్కే మహమూద్‌, శ్రీకాంత్‌ చారి, రాబర్ట్‌, బాచి, రామ్‌చందర్‌, కోండ్ర శంకర్‌, బరిగెల వినయ్‌, శ్రీను, రాజ్‌కుమార్‌, విజయ్‌, కిట్టు, శ్రీనాథ్‌, పాము రాజేష్‌, సుబ్బు, వినీల్‌రావు, వీరస్వామి, లీగల్‌ సెల్‌ బాధ్యులు నాయిని రవి తదితరులతో పాటు వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులు, రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి 20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ,...

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అర్హులైన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.