epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!
మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు
ఇప్పుడు ఖాళీ చేయాలంటూ  బెదిరింపులు..ఒత్తిళ్లు
120 నిరుపేద కుటుంబాల నివాసాలపై భూ వివాదం పంజా
అర్బన్‌ సీలింగ్‌ భూమి రికార్డుల్లో మార్పులు
ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి ఎలా వెళ్లింది..? అసలు యజమాని ఎవరు?
జేసీబీల భయంతో బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు
పట్టాలు, పక్కా ఇళ్ల కోసం రోడ్డెక్కిన పేదలు
వెలుగుమట్ల తరహా పరిణామాలు పునరావృతమవుతాయా?
కాకతీయ, తెలంగాణ బ్యూరో / హ‌న్మ‌కొండ : పేదల గుడిసెలు.. భూమి చుట్టూ వివాదాలు.. తెరపైకి వస్తున్న రాజకీయ విమర్శలు.. తెర వెనుక జ‌రుగుతున్న కుట్ర‌లు.. ఖాళీ చేయాలంటూ ఒత్తిళ్లు.. జేసీబీల భయం.. ఇదీ కాజీపేటలోని వైఎస్సార్‌ నగర్‌ ప్రస్తుత పరిస్థితి. ఖమ్మం వెలుగుమట్లలో పేదల నివాసాలు, భూమి వివాదం చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే ఇప్పుడు కాజీపేట వైఎస్సార్‌ నగర్‌ కూడా అదే తరహా సమస్యల దిశగా పయనిస్తోందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలు తమ నివాసాలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగాయి. ఒకవైపు భూమి యాజమాన్యంపై సందిగ్ధత.. మరోవైపు రికార్డుల్లో మార్పులపై అనుమానాలు.. ఇంకోవైపు గుడిసెల తొలగింపు ప్రయత్నాలంటూ బాధితుల ఆవేదన.. వెరసి వైఎస్సార్‌ నగర్‌ వివాదం కీలక మలుపు తిరుగుతోంది.
మూడు దశాబ్దాల నివాసాల‌కు ఇప్పుడు అభద్రత
వైఎస్సార్‌ నగర్‌లోని పేద కుటుంబాలు దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. ఇక్కడే గుడిసెలు వేసుకుని కుటుంబాలను పెంచుకున్నాయి. పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. కాలక్రమంలో కాలనీలో దేవాలయాలు, రహదారులు, విద్యుత్‌ దీపాలు, తాగునీటి నల్లాలు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతంలో ప్రజా అవసరాలకు సంబంధించిన సదుపాయాలు కల్పించాయి. రైల్వేలో పదవీ విరమణ చేసిన అధికారుల కోసం కార్యాలయం సైతం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇంటి నంబర్లు కేటాయించారని, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో కాలనీకి వైఎస్సార్‌ నగర్‌గా పేరు పెట్టుకున్నామని గుర్తుచేస్తున్నారు. ఇన్నేళ్లుగా నివసిస్తున్న తమకు ఇప్పుడు నివాస భద్రత లేకుండా పోయిందని, ఎప్పుడు గుడిసెలు తొలగిస్తారోననే భయంతో బతుకుతున్నామని వాపోతున్నారు.
కోట్ల విలువైన భూమి.. హక్కులు ఎవరివి?
కాజీపేట మండల పరిధిలోని సర్వే నంబర్లు 70, 71, 72ల్లో కలిపి 20 ఎకరాల 37 గుంటల భూమి ఉన్నట్లు స్థానికుల వివరాలు చెబుతున్నాయి. ఇందులో 17 ఎకరాల రెండు గుంటల మేర నివాసాలు ఏర్పడగా, మరో మూడు ఎకరాల 35 గుంటలు మిగిలి ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ భూమి అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలోకి వచ్చినట్లు గతంలో ఉన్న పత్రాలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ భూమిపై పూర్తి హక్కులు ఎవరివి? ప్రభుత్వానికా? ప్రైవేటు వ్యక్తులకా? అనే అంశంపై అధికారులు సైతం నోరు మెద‌ప‌డం లేదు. అత్యంత గోప్య‌త పాటిస్తూ..నిజాల‌ను ర‌హ‌స్యంగా దాచిపెడుతుండ‌టంపై అనుమానాలు క‌లుగుతున్నాయి. స్థానికుల అంచనా ప్రకారం భూమి విలువ వందల కోట్ల రూపాయలు ఉండటంతో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అర్బన్‌ సీలింగ్‌ చట్టం.. పాత ఫైళ్లలో కీలక వివరాలు
వైఎస్సార్‌ నగర్‌ భూమికి సంబంధించి గతంలో పట్టణ భూ పరిమితి చట్టం కింద విచారణ జరిగినట్లు అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వ పత్రాలు వెల్లడిస్తున్నాయి. 1995 జనవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సర్వే నంబర్లు 70, 71, 72, 73ల్లో కలిపి 58,154 చదరపు మీటర్ల భూమిని మిగులు భూమిగా గుర్తించినట్లు అప్పటి ప్రత్యేక అధికారి నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ, గెజిట్‌ ప్రచురణ జరిగినట్లు పత్రాల్లో వివరాలున్నాయి. అయితే భూ యజమానుల వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తదుపరి ప్రక్రియపై స్టే వచ్చినట్లు అప్పటి నివేదికలు సూచిస్తున్నాయి. సర్వే నంబర్లు 71, 72ల్లోని 22,065 చదరపు మీటర్ల భూమిని ఆర్టీసీ బస్టాండ్‌ లేదా బస్‌ డిపో అవసరాలకు ప్రతిపాదించినట్లు కూడా పాత ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఉంది. ఈ భూమికి సంబంధించి న్యాయస్థానాల తుది ఉత్తర్వులు, ప్రభుత్వ స్వాధీన ప్రక్రియ, ఆర్టీసీకి అప్పగించిన వివరాలు ఇప్పటికీ పరిశీలించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయి.
రికార్డుల మార్పుల వెనుక కథేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్బన్‌ సీలింగ్‌ చట్టానికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో భూమి రికార్డుల్లో మార్పులు జరిగాయా? ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి ఎలా వెళ్లింది..? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. తమ నివాసాలను ఖాళీ చేయించేందుకు గత ఏడు నెలలుగా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ నగర్‌ వాసులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు కూలీలను, జేసీబీలను తీసుకొచ్చి గుడిసెలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎదిరిస్తే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరి నుంచి తమకు ప్రాణహాని ఉందని కాలనీవాసి నీరటి పావని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల పాలనలో తమకు ఇబ్బందులు ఎదురుకాలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరింపులు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.
రాజకీయ హామీలు.. పరస్పర విమర్శలు..!
వైఎస్సార్‌ నగర్‌ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. గతంలో కాంగ్రెస్‌ నాయకులే వైఎస్సార్‌ పేరుతో పేదలకు గుడిసెలు ఏర్పాటు చేయించారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హయాంలో గుడిసెల తొలగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని దాస్యం వినయ్‌ భాస్కర్‌ విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను, అప్పటి ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని గుర్తుచేస్తూ, ఇప్పుడు పేదల సమస్యపై కడియం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌ నగర్‌ సమీపంలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు నాయిని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా వచ్చాయని కూడా నిలదీస్తున్నారు. మరోవైపు ఈ విమర్శలపై సంబంధిత నాయకుల వివరణ, కాంప్లెక్స్‌ అనుమతులకు సంబంధించిన అధికారిక పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!

జోరందుకోనున్న తెలంగాణ జనసేన! సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్‌ బలాయ్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి...

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.