ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
తొర్రూర్ ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి
కాకతీయ,ఇనుగుర్తి : అటవీ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని విధుల్లో భాగంగా కఠిన చర్యలు తప్పవని తోరూర్ ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో తొర్రూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి బ్లాక్ సరిహద్దుల గుర్తింపు కు మొదలు చుట్టారు. మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్ ఏరియాలో సరిహద్దుల బౌండరీ రౌతులను ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి సెక్షన్ ఆఫీసర్ టి రామారావు బీట్ ఆఫీసర్ జె భాస్కర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫారెస్ట్ కు సంబంధించిన భూములను ఆక్రమిస్తే ఎంతటి వారనైనా విధుల్లో భాగంగా సహించేది లేదని తొర్రూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి హెచ్చరించారు. అటవీ భూములు, హద్దులు,పరిరక్షణ లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి ఈస్ట్ బ్లాక్ సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహిస్తున్న దృష్ట్యా ముందస్తుగా రిజర్వ్ ఫారెస్ట్ భూముల బౌండరీలను పరిశీలిస్తూ గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

