epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ
ఆ భూముల‌తో నాకేలాంటి సంబంధం లేదు
విచార‌ణ చేప‌ట్టాల‌ని గ‌తంలో నేనే క‌లెక్ట‌ర్‌కు లేఖ రాశాను
భూములపై కోర్టు వివాదాలు, పట్టా భూముల అంశాల పరిశీలన
ప్రభుత్వ భూములైతే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించా
గుడిసెవాసుల సమస్యలను పరిష్కరిస్తాం.. ఎవరినీ ఖాళీ చేయమని చెప్పలేదు
బ్రోకర్లు, భూకబ్జాదారుల మాటలు నమ్మొద్దు
మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, విజయ్‌భాస్కర్‌లపై పరోక్ష విమర్శలు
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫైర్‌

కాకతీయ, హ‌న్మ‌కొండ : వైఎస్సార్‌ నగర్‌ భూముల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తన వైఖరిని వెల్లడించారు. ఈ భూముల వ్యవహారంతో తనకు సంబంధం లేదని వివరించే ప్రయత్నం చేశారు. భూములపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని తానే గతంలో కలెక్టర్‌కు లేఖ రాయాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని, సగానికి పైగా నివేదికలు ఇప్పటికే అందాయని వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో మిగిలిన సమాచారం కూడా వస్తుందని చెప్పారు. కాజీపేట 62వ డివిజన్‌లో నిర్వహించిన విలేక‌రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, ఆయన సోదరుడు విజయ్‌భాస్కర్‌లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు సంధించారు.

భూములపై సమగ్ర విచారణ జరగాలి!

వైఎస్సార్‌ నగర్‌ పరిధిలోని భూములకు సంబంధించి కొన్ని కోర్టు వివాదాల్లో ఉన్నాయని, మరికొన్ని చోట్ల ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొన్ని భూములు ప్రైవేటు పట్టా భూములని గతంలో అధికారులు చెప్పినట్లు వివరించారు. అయితే ఏ భూమి ప్రభుత్వానిది, ఏది ప్రైవేటు పట్టా భూమి, ఎక్కడ కోర్టు కేసులు ఉన్నాయి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం అన్ని రికార్డులను సేకరించి కలెక్టర్‌కు అందించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములపై నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి ఉంటే వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. భూముల వాస్తవ పరిస్థితిని తేల్చకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, విచారణ పూర్తయిన తర్వాత సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

గుడిసెవాసులను ఖాళీ చేయమని చెప్పలేదు!

గుడిసెవాసులను తాను ఎక్కడా ఖాళీ చేయాలని ఆదేశించలేదని నాయిని స్పష్టం చేశారు. రైల్వే అధికారులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు తనను కలిసిన సందర్భంలోనూ ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని ఖాళీ చేయమని చెప్పలేదన్నారు. గుడిసెవాసుల సమస్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బ్రోకర్లు, భూవ్యవహారాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తులను నమ్మి పేదలు ఇబ్బందుల్లో పడవద్దని సూచించారు. బాధితులు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు వివరిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఏకపక్ష వీడియోలు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు.

సంఘాలకు స్థలాలిచ్చింది మేమే!

గుడిసెవాసుల సమస్యలతోపాటు వివిధ సంఘాలకు స్థలాల కేటాయింపుల అంశాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఉపాధ్యాయ సంఘాలు, ఆటో యూనియన్లు, స్థానిక మీడియా సంఘాలు, కుల సంఘాలకు స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. ఆయా సంఘాలకు సుమారు 15 నుంచి 20 గజాల చొప్పున స్థలాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పటికే పలువురికి ఇళ్లు అందించామని పేర్కొన్నారు. తమకు కూడా ఇళ్లు కావాలని కొందరు తనను సంప్రదించారని, అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. 42 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలోనూ ఎవరి పేరుపై పట్టా ఉంటే వారికే హక్కు ఉంటుందని, బాధితులు తమ హక్కుల కోసం ఫిర్యాదు చేయాలని సూచించారు.

బ్రిడ్జి, ఐటీ టవర్‌ నిర్మాణానికి కృషి

కాజీపేట అభివృద్ధిపై మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.16.50 కోట్ల నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఒక కంపెనీ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. మరో వారం, పది రోజుల్లో మూడు ట్రక్కుల సామగ్రి వస్తుందని, పనులు పూర్తయ్యే వరకు తాను పర్యవేక్షిస్తానని చెప్పారు. బ్రిడ్జి పూర్తయిన తర్వాతే ఓట్లు అడుగుతానని ప్రకటించారు. కాజీపేటలో ఐటీ టవర్‌ నిర్మాణం, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అభివృద్ధి నిధులు కోరాలని, ఆర్ట్స్‌ కళాశాల అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

స్మార్ట్‌సిటీ నిధులపై గత పాలకుల వైఫల్యం!

గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌సిటీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారని విమర్శించారు. నిధులు తీసుకురావడమే కాకుండా వాటిని సకాలంలో ఖర్చు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుందని అన్నారు. అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై 54 కేసులు పెట్టారని ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు తమ సంస్కృతి కాదన్నారు. తన పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే ఉపేక్షించబోనని, ఆరోపణలు చేసేవారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు రూ.2 లక్షల ప్లాటు.. రూ.20 లక్షల లెక్క! నగదుకు...

సమస్యలు తీరేదెప్పుడు?..

సమస్యలు తీరేదెప్పుడు?.. ఉద్యోగుల గళం వినేదెవరు? పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఎదురుచూపులు రెండో వేతన...

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌! మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు ఇప్పుడు ఖాళీ చేయాలంటూ ...

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!

జోరందుకోనున్న తెలంగాణ జనసేన! సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్‌ బలాయ్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి...

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.