మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు లో గ్రామస్థాయిలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెల్లి కుదురు సెక్టార్ సూపర్వైజర్ సరిత ఆధ్వర్యంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నీ మునిగలవేడు గౌట్ హై స్కూల్ లో ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా గ్రామ సర్పంచ్ బొల్లి కొండ చైతన్య నాగరాజు, కన్వీనర్ గా వీరలక్ష్మి తో పాటు 15 మంది సభ్యులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్య, సూపర్వైజర్ సరిత లు మాట్లాడుతూ గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ 15సభ్యులతో కూడిన కమిటీ, ఇందులోని సభ్యులు గ్రామ స్థాయిలో పిల్లలపై జరిగే నేరాలను ఆపడానికి మరియు వారికి పిల్లల చట్టాలపై అహగహన కల్పించడానికి, తల్లిదండ్రులకు, పిల్లలకు చైల్డ్ టైప్స్ పై అహగహన కల్పించడానికి మరియు పిల్లలుకు జరిగే బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, శారీరక మానసిక విధింపుల నుండి సంరక్షణ కొరకు, బాలలతో బిక్షాటన, బాలల పట్ల లింగ పరమైన వివక్ష ను ఆపడానికి ఈ కమిటీ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం స్వప్న, ఎన్జీవో సోమన్న, కానిస్టేబుల్ వెంకన్న, భవాని, సింధు, యాకయ్య, ఉపాధ్యాయులు రమేష్, మనిషా, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

