ఎంఎస్ఎఫ్ కమిటీలను బలోపేతం చేయాలి!
కాకతీయ, ఆత్మకూరు: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన మండల కమిటీలను బలోపేతం చేయాలని ఎంఆర్పీఎస్ హనుమకొండ జిల్లా కో-ఇన్చార్జి తడుగుల విజయ్ మాదిగ అన్నారు. శనివారం ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10న జరిగే మండల కమిటీ ఎన్నికలకు మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారిని సంఘంలో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఐక్యత, సంఘటిత శక్తిని పెంపొందించాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్ మాదిగ, కుక్కముడి కుమారస్వామి మాదిగ, అర్షం పవన్ మాదిగ, మాదాసి అనిల్ మాదిగ, సంగే రాజు మాదిగ, మాసి శ్రావణ్ మాదిగ, మాదాసి యాకూబ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

