వైఎస్సార్ నగర్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జనసేన నేతల వినతి
కాకతీయ, హనుమకొండ : కాజీపేటలోని వైఎస్సార్ నగర్ కాలనీవాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పద్మజాదేవి, గాదె పృథ్వీ కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి పార్టీ తరఫున వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి అర్హులైన వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పిట్టల మధుసూదన్, గుండెకారి రవితేజ, కాలనీవాసులు భవాని, శిరీష, యాసిన్, సాయి కుమార్, అంజలి తదితరులు పాల్గొన్నారు.

