చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, పాలకమండలి ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల భవిష్యత్తు, సమాజంలో వారి బాధ్యతల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెడుపోక సుజాత యాకయ్య ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, గ్రామ కార్యదర్శి పిట్టల శేఖర్, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, గుండాల మంగమ్మ ధర్మయ్య, ముత్యాల సోమక్క, చెడుపాక అలివేలు వెంకన్న బైరు శ్రీనివాస్, నాయిని వెంకన్న, దాసరి ప్రకాష్, చెడుపాక శేఖర్, కొయ్యడి మల్లయ్య, నాగన్న, అంగన్వాడీలు, ఆయాలు, వివో లు తదితరులు పాల్గొన్నారు.

