దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం
హుస్సేన్ నాయక్ సేవలు మరువలేనివి
బీజేపీ జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాలలోని దివ్యాంగులకు అలీమ్యాకో— సి ఎస్ ఆర్ కార్యక్రమం ద్వారా మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సీఎస్టీ) సభ్యులు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ చొరవతో, అలిమేకో సి ఎస్ ఆర్ కార్యక్రమం ద్వారా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు మోటరైజ్డ్ ట్రై సైకిళ్లను ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, చిన్ననాగారం, చినియ తండా, మీట్య తండా దివ్యాంగులకు స్వయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తూ, వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబన పెంపొందించేందుకు లబ్ధిదారులకు సైకిల్ పంపిణీ చేశామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం, ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే హుస్సేన్ నాయక్ ఆశయమని వారికి మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

