epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శుభారంభం

స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శుభారంభం
రూ.10 కోట్ల పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన..

కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామ శివారులో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణం, యూనిసిటీ వెంచర్ అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో భారీ నిధులు కేటాయిస్తున్నారన్నారు. విమానాశ్రయం, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4 వేల కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కుడా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. వెంచర్ వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల బీటీరోడ్డు ఉనికిచర్ల వరకు పొడిగించాలని సూచించారు. ఇదే ప్రాంతంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రానుండటంతో విస్తృత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ రహదారిని ఉనికిచర్ల, రాపాకపల్లి, దేవునూరు గుట్టల వరకు విస్తరించనున్నట్లు చెప్పారు. దేవునూరు గుట్టలను ఎకో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు ఆక్సిజన్ పార్కులు, ట్రెక్కింగ్ మార్గాలు, రిసార్ట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ మార్పు ఆరోపణలపై వచ్చిన స్పీకర్ నోటీసులకు సంబంధించి శ్రీహరి స్పందిస్తూ, వివరాలు ఇవ్వడానికి మరింత సమయం కోరినట్లు తెలిపారు. స్పీకర్ దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. పదేళ్లలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ స్టేషన్ ఘనపూర్ ఆశించినంత అభివృద్ధి చూడలేదని విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం, హామీల అమలు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వచ్చినా పోటీ చేసేది నేనే, ప్రజలు గెలిపించేది కూడా నన్నేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా అధికారులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.