epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల హక్కుల కోసం పోరాటం

కార్మికుల హక్కుల కోసం పోరాటం
ప్ర‌భుత్వం మాట ఇచ్చి త‌ప్పింది
బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వ్యాఖ్యలు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం భూమి కబ్జా అంశం మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. కార్మిక భవనం నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్తే తమ ఎన్నికల గెలుపు కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడానికే కార్మిక భవనం భూమి అక్రమ కబ్జాలకు అంగీకారం తెలిపారా? అని ప్రశ్నించారు. “నీవు నిజంగా కార్మికుల భవనం కోసం పోరాడుతున్నావా? లేక కబ్జా భవనం కోసం పాటుపడుతున్నావా?” అంటూ స్థానిక ఎమ్మెల్యే వైఖరిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పష్టత ఇవ్వకపోతే కార్మిక కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతాయని హెచ్చరించారు. కార్మిక భవనం కోసం ప్రభావిత భూమిని తిరిగి కొనుగోలు చేసి భవనం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకాలేదని ప్రదీప్‌రావు మండిపడ్డారు. ఏడాది గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కబ్జాదారులపై చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. అందుకే మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇది కేవలం భవనం సమస్య కాదని, కార్మికుల హక్కుల కోసం సాగే పోరాటమని స్పష్టం చేశారు. కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావంచన పాలనకు ఇదే నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం మేల్కొనే వరకు ఈ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీజేపీ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.