epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?

చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?
ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ అటవీ అధికారులు
అసలు దోషులు తప్పించుకుంటున్నారా?
‘టన్నుల లెక్క‌న‌’ లంచం డిమాండ్‌
భ‌ద్రాద్రి జిల్లా అట‌వీశాఖ‌లో అక్ర‌మార్కులు
ఏసీబీ దాడుల‌తో మ‌రికొంత‌మంది అధికారుల‌పై చ‌ర్చ‌

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కాసులకు కక్కుర్తి పడి అటవీ శాఖ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కంచె చేను మేసిందా అన్న చందంగా ఉన్న ఈ వ్యవహారంలో, సోర చేపను వదిలేసి చిన్న చేపలకే ఏసీబీ వల పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డామిట్ కథ అడ్డం తిరుగుతుందో ఏమో కానీ, అసలు దోషులు పక్కకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖను డివిజన్ల వారీగా మూడు జోన్లుగా విభజించారు. కొత్తగూడెం జోన్–1, జోన్–2, అన్నపురెడ్డిపల్లి జోన్–3గా విభజన జరిగింది. కొత్తగూడెం జోన్–1 పరిధిలో సుమారు 5,500 ఎకరాల్లో జామాయిల్ తోటలు ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, గరిమెళ్లపాడు, పెనుబల్లి, రామవరం, శ్రావణ్ షాట్, గరిపేట, పెనగడప, తిప్పనపల్లి, సీతాయిగూడెం, జూలూరుపాడు మండలంలోని సూరారం సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. వీటికి డివిజనల్ ప్లాంటేషన్ మేనేజర్‌గా తాడి రాజేందర్ పని చేస్తున్నారు.

‘టన్నుకు’ లంచం
2002–03 సంవత్సరానికి సంబంధించి సుమారు 3,900 ఎకరాల్లో జామాయిల్ కటింగ్కు టెండర్లు పిలిచారు. కొత్తగూడెం ప్రాంతంలో ఎనిమిది యూనిట్లకు గాను జామాయిల్ కటింగ్, రవాణా పనులకు మొత్తం రూ.2.90 కోట్లకు ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే టెండర్ పొందిన కాంట్రాక్టర్ నుంచి టన్నుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో అనేక ఆంక్షలు, అడ్డంకులు పెట్టడంతో చివరికి టన్నుకు రూ.90కి బేరం కుదిరినట్లు తెలుస్తోంది. తొలి విడతగా రూ.3.50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదరగా, ఆ నగదును ఒక వ్యక్తి ద్వారా సీతాయిగూడెంకు పంపించారు.

నగదు ఎవరికివ్వాలో తెలియక… ఏసీబీకి సమాచారం

నగదు తీసుకొచ్చిన వ్యక్తికి ఎవరికి ఇవ్వాలో స్పష్టత లేకపోవడంతో, సీతాయిగూడెంలో కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణకు అప్పగించినట్లు సమాచారం. ఈలోగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు గోపాలకృష్ణ వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో జరిగిన మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, సూపర్వైజర్ గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

చిన్న చేపలే పట్టుబడ్డాయి… తిమింగలం సంగతేంటి?

ఏసీబీ దాడుల్లో ప్లాంటేషన్ మేనేజర్, సూపర్వైజర్‌లను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ప్రధాన కారణమని చెప్పబడుతున్న డివిజనల్ మేనేజర్ శ్రీవాణిని ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సీతాయిగూడెం ప్రాంతానికి చెందిన సూపర్వైజర్ గోపాలకృష్ణ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీతాయిగూడెం పంచాయతీ నాలుగో వార్డు మెంబర్‌గా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందారు. గెలుపు సంబరాలు ముగియకముందే ఏసీబీ వలకు చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఈ కేసులో నిజంగా తిమింగలాలు బయటపడతాయా? లేక కథ ఇక్కడితో ముగుస్తుందా? అన్నది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.