epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పంట వ్యర్థాల‌తోనే భూమికి రక్ష

పంట వ్యర్థాల‌తోనే భూమికి రక్ష
పర్యావరణ సంరక్షణకు బయోచార్
కలెక్టర్ జితేష్ పాటిల్

కాకతీయ, కొత్తగూడెం : భూమి ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు బయోచార్ వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు నర్సరీ ఆవరణలో ఆధునిక పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై బయోచార్ వినియోగంపై మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురం కైలాస్ అఖరే ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లాలో విస్తారంగా లభ్యమయ్యే పత్తి కట్టెలు, మొక్కజొన్న చొప్ప వంటి పంట వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో బయోచార్ తయారు చేసే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. ప్రత్యేకంగా ఇనుముతో తయారుచేసిన పరికరంలో పంట అవశేషాలను నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద కాల్చి నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి చేసే విధానాన్ని నిపుణులు వివరించినట్లుగా పేర్కొన్నారు.
అనంతరం తయారైన బయోచార్‌ను గోమూత్రం, ఆవు పేడ మిశ్రమంలో 15 రోజుల పాటు ఉంచి సక్రియం(యాక్టివేషన్) చేసి ఎరువుగా వినియోగించే విధానాన్ని వివరించారు. ఈ విధానం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతత మెరుగుపడటంతో పాటు తేమ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గ్రామ సర్పంచ్ వాడే రాములు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ, ఎన్ఎస్ఎస్ అధికారులు వేముల కామేశ్వరరావు, శ్రీదేవి, ఎన్సిసి ఇంచార్జ్ ధర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్, రాంబాబు, బూర్గంపాడు, టేకులపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, దుమ్ముగూడెం, జూలూరుపాడు, గుండాల మండలాల ఎంపీడీవోలు అధ్యాపకులు రాజ్ కుమార్, సూపర్డెంట్ విజయ్ ప్రసాద్, వార్డు మెంబర్లు, విద్యార్థులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.