epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!

తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!
కొండాపురంలో హత్య కేసు చేధించిన పోలీసులు
30 ఏండ్ల నాటి భూ తగాదాలే కారణం
ఎవరూ లేని సమయంలో పారతో అన్న‌పై తమ్ముడి దాడి
నిందితుడు వెంకన్న అరెస్టు

కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఈనెల 5వ తేదీ సోమవారం చోటుచేసుకున్న కొండ వీరస్వామి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మృతుడి తోడబుట్టిన తమ్ముడు కొండ వెంకన్న (58)నే హత్యకు పాల్పడినట్లు బుధవారం నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వీరస్వామికి తమ్ముళ్లు లక్ష్మయ్య, వెంకన్న ఉన్నారు. వీరస్వామి, చిన్న తమ్ముడు వెంకన్న మధ్య వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నను హతమార్చేందుకు వెంకన్న పక్కా పథకం వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం బ్యాంకు పనులు ముగించుకుని వీరస్వామి నేరుగా తన పొలం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న మరో తమ్ముడు లక్ష్మయ్యను చేపలు పట్టడానికి వెళ్దామని చెప్పి, కుండ తీసుకురావాలని పంపించాడు. అనంతరం నల్లకుంట చెరువు శిఖం వద్ద గుండ్ల బండ సమీపంలోని నీటిమడుగులోకి చేపలు పట్టేందుకు దిగాడు.

ఎవరూ లేని సమయంలో పారతో దాడి
ఈ అవకాశాన్ని గమనించిన వెంకన్న ఇదే సరైన సమయమని భావించి, పక్కనే ఉన్న పారతో వీరస్వామి తలపై, కుడి భుజంపై, ఛాతిపై బలంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి కుండ తీసుకుని వచ్చిన లక్ష్మయ్య నీటిమడుగు వద్ద అన్న విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకన్నను రాయపర్తి బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. కేసును ఛేదించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ అంబటి నర్సయ్యలు సీఐ కొమ్మూరి శ్రీనివాస్, ఎస్సై ముత్యం రాజేందర్‌లను అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.