epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కమ్యూనిస్టులు ఐక్యంకావాలి

కమ్యూనిస్టులు ఐక్యంకావాలి

ఎర్రజెండా పోరాటాలతోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం
రాజ్యాంగ హక్కుల్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
సీపీఐ సెమినార్‌లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: దేశంలో నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే కమ్యూనిస్టుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని లయన్స్ భవనంలో భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై విజయ సారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగింంచారు. కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి బలహీనపడడం వల్లనే దేశంలో మతోన్మాదులు పెరిగిపోయారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మోడీ ప్రభుత్వం నియంతృత్వ, ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, కవులు, కళాకారులపై కక్ష గట్టి అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ధ్వ‌జ‌మెత్తారు. పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని, కమ్యూనిస్టులు విడిపోవడంతోనే దేశంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయ‌న తెలిపారు. కమ్యూనిస్టులు ఐక్యం కావాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలి

ఈనెల 18న ఖమ్మంలో జ‌రిగే సిపిఐ జాతీయ శతవార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. చరిత్రలో నిలిచిపోయేలా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి 18న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. వందేళ్ల సిపిఐ సమర చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలిన రాజకీయ పరిస్థితులు, మతోన్మాద ప్రమాదం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు. ఖమ్మం ఎస్ఆర్ ఆండ్ బీజిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈసభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. జనవరి 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతాయన్నారు. 18న బహిరంగ సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 15 వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు చేస్తారని, వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని తెలిపారు.

20న జాతీయ స్థాయి సెమినార్

ఖమ్మంలో జనవరి 20న జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించనున్న‌ట్లు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి తెలిపారు. ఈ సెమినార్‌కు అన్ని వామపక్షాల జాతీయ నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబి, వామపక్షాల నేతలు దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ జరుగుతుందని ఆయ‌న తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.