epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు

ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు
అక్రమ కట్టడాలను వెంట‌నే తొల‌గించాలి
ఆలయాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాలి
శివారు డివిజన్ల ప్రజా కష్టాలు తీర్చండి
మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి విన‌తి

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కమిషనర్‌ను కలిసి, నగర పరిధిలో ముఖ్యంగా శివారు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
కార్పొరేషన్ పరిధిలోని శివారు డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సరైన సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోతుండటంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పక్కా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 23వ డివిజన్‌లో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లను వెడల్పు చేసి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

దేవాలయాల రక్షణపై నిర్లక్ష్యం

నగరంలో హిందూ దేవాలయాల అభివృద్ధి, రక్షణను మున్సిపల్ యంత్రాంగం విస్మరిస్తోందని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఆలయాలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆవరణలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు మున్సిపల్ నిధులతో రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా మహిళల కోసం స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా దేవాలయాల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఇక 37వ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, 1వ టౌన్ ప్రాంతంలో ప్రజల అవసరాల దృష్ట్యా సమీకృత కూరగాయల మార్కెట్, రైతు బజార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నగర సాంస్కృతిక వికాసం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పనులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు, దొంగల సత్యనారాయణ, గుత్తా వెంకటేశ్వరరావు, వీరెల్లి రాజేష్ గుప్తా, రవి గౌడు, బోయినపల్లి సురేష్, కొమిలి శ్రీనివాస్, అల్లిక అంజయ్య, గడిల నరేష్, చిన్ని కృష్ణ, తడుపునూరి రవీందర్, చారి, రాము, కంపసాటి అజయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.