epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిబంధనల గీత దాటొద్దు!

నిబంధనల గీత దాటొద్దు!
భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను సన్నద్ధం చేసుకోవాలి
అధికారుల‌కు జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి.శ్రీజ ఆదేశాలు
సీఎం పర్యటన ఏర్పాట్లపై యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. జనవరి 18న ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం, మినిట్ టు మినిట్ షెడ్యూల్ వెలువడకముందే అవసరమైన సన్నద్ధత ఏర్పాట్లన్నింటిని పూర్తి చేయాలని సూచించారు. పర్యటనలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల షెడ్యూల్ ఇదే

జనవరి 18న ఉదయం ముఖ్యమంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయి, జేఎన్‌టీయూ కళాశాల భవన నిర్మాణం, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్‌లను ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం పూర్తి స్థాయి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీఎం కాన్వాయ్‌లో వినియోగించే వాహనాలను ముందస్తుగానే పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నర్సింగ్ కళాశాల, సర్దార్ పటేల్ స్టేడియం వద్ద హెలిప్యాడ్‌లను డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి అక్కడ ఫైర్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లాలోని సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని 108 అంబులెన్స్‌తో పాటు సీఎం కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ప్రకారం సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అతిథి గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, నాణ్యమైన స్నాక్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి సర్టిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు అందించాలని, మీడియాతో సమన్వయం చేసుకుంటూ విస్తృత కవరేజ్ వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా బ్రీఫ్ నోట్స్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.