epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెత్త డ్యూటీ!

చెత్త డ్యూటీ!
వరంగల్ బల్దియాలో విధుల పట్ల నిర్లక్ష్యం
ఇష్టారాజ్యంగా పారిశుధ్య సిబ్బంది డ్యూటీ
పలువురు డ్రైవర్లు పనికిరాకుండా డుమ్మా
సేకరించిన చెత్తను డంప్యార్డుకు చేరవేయడంలో అలసత్వం
ట్రాన్స్ఫర్ స్టేషన్లలో లోడ్ వాహనాలను వదిలేసి వెళ్తున్న వైనం
లోడ్తో వాహనాలను వదిలేస్తే మరమ్మతులకు చేరుకోవా?

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థలో కింది స్థాయి సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ముఖ్యంగా పారిశుధ్య విభాగంలో డ్యూటీలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణ, తరలింపు బాధ్యతల్లో కీలకమైన వాహన డ్రైవర్ల అలసత్వం వల్ల వ్యవస్థే దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం హన్మకొండలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో రెండు వాహనాల నిండా చెత్తతో ఉన్న టిప్పర్‌, కాంపాక్టర్‌ను డ్రైవర్లు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. సాధారణంగా ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి చెత్తను రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలించి, ఖాళీ వాహనాలను తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ లోడుతోనే వాహనాలను వదిలేసి వెళ్లడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

వాహనాలు ఎవరివి కావా?

భారీ వాహనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే సరైన నిర్వహణ అత్యంత అవసరం. కానీ బల్దియాలో వాహనాల మెయింటెనెన్స్‌ను గాలికొదిలేసినట్లే పరిస్థితి కనిపిస్తోంది. హన్మకొండ బాలసముద్రంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో లోడుతోనే వాహనాలను గంటల తరబడి నిలిపివేయడం వల్ల టైర్లపై అధిక భారం పడుతుంది. తడిచెత్తతో వాహన బాడీకి తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ చివరకు వేలల్లో ఖర్చుతో మరమ్మతులకు దారి తీస్తాయన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వాహనమంటే ఎవరిదో కాదన్న ధోరణితో వ్యవహరిస్తే నష్టమయ్యేది ప్రజాధనమేనన్న విషయాన్ని మరిచిపోవద్దని నగరవాసులు అంటున్నారు. నెలకో కొత్త వాహనం కొనడం పరిష్కారం కాదని, ఉన్న వాహనాలను జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

డ్రైవర్ల అలసత్వం హద్దులు దాటిందా?

బల్దియా వాహనాల డ్రైవర్లలో కొందరు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొత్తవి కావు. ప్రభుత్వ వాహనమనే అహంకారంతో ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్నారని, గతంలో ప్రమాదాలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. హన్మకొండ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో ర్యాంప్‌పై వాహనాలు ఎక్కించిన తర్వాత బ్రేక్‌ల విషయంలోనూ అలసత్వం చూపడం వల్ల కొన్ని సందర్భాల్లో వాహనాలు రివర్స్‌లో వేగంగా వచ్చి బోల్తాపడిన ఘటనలున్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాహనాలు మరమ్మతులకే పరిమితమయ్యే ప్రమాదంతో పాటు ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే బల్దియా వ్యవస్థపై మరింత విమర్శలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.