epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
రెండున్నర కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కమీషన్ల కోసమే కాళేశ్వరం – పేదల ఇళ్లు విస్మరణ

కాకతీయ, కూసుమంచి :రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

నిధుల వరదతో అభివృద్ధి వేగం

పర్యటనలో భాగంగా కోట నారాయణపురంలో ఇరవై రెండు లక్షల అరవై వేల రూపాయలతో కాంక్రీట్ డ్రెయిన్ నిర్మాణానికి, ఎస్సీ–బీసీ కాలనీలో డెబ్బై రెండు లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత కాంక్రీట్ రహదారులు, డ్రెయిన్‌ల పనులకు శంకుస్థాపన చేశారు. గుదిమళ్లలో నలభై నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలతో, ఇందిరమ్మ కాలనీ–ఒకటిలో డెబ్బై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల అంచనా వ్యయంతో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే నంద్యా తండాలో ఇరవై ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలతో డ్రెయిన్‌లు, జంగాల కాలనీలో పద్నాలుగు లక్షల పది వేల రూపాయలతో రహదారులు, డ్రెయిన్‌ల పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనని మంత్రి భరోసా ఇచ్చారు.

కాళేశ్వరంపై ఘాటు విమర్శలు

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల కమీషన్లు వస్తాయనే ఆశతోనే అప్పటి పాలకులు దానిపై దృష్టి పెట్టారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావని భావించి ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా అందిస్తామని స్పష్టం చేశారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద పది వేల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, తమ ప్రభుత్వం రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల దీవెనలతో అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.