epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!

ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!
స్థానికుల ఫిర్యాదుతో బయటపడిన గుట్టు
రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు
30 కేజీల చెడిపోయిన మటన్ స్వాధీనం
జైలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు

కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో కుళ్లిపోయిన మటన్ అమ్మకాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. మూడో పట్టణ ప్రాంతంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న మస్తాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మటన్ షాపులో ఈ అక్రమ దందా బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దుకాణంలో డీప్ ఫ్రిజ్‌లో దాచిపెట్టిన సుమారు 30 కేజీల కుళ్లిపోయిన మటన్‌ను అధికారులు గుర్తించారు. ఫ్రిజ్ తలుపు తెరవగానే భరించలేని దుర్వాసన రావడంతో ఆ మాంసం పూర్తిగా పాడైపోయినట్లు స్పష్టమైంది. అయినప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా విక్రయాలు సాగిస్తున్నట్టు తేలింది. స్థానికుల కథనం ప్రకారం ఈ షాపు యజమాని గత కొన్ని ఏళ్లుగా ఇదే విధంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాక జిల్లా జైలుకు వారానికి ఒకసారి మటన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. నగరంలోని పలు పెద్ద హోటళ్లకు కూడా ఇక్కడి నుంచే మాంసం సరఫరా అవుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

అధికారుల తనిఖీలతో అసలు విషయం బహిర్గతం

ప్రాంతవాసుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దుకాణాన్ని తనిఖీ చేసింది. తనిఖీల్లో చెడిపోయిన మటన్ నిల్వలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వచ్చారన్న విషయం తెలిసి నిర్వాహకుడు ముందుగానే మాంసాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మహిళా జవాన్ అప్రమత్తంగా వ్యవహరించి అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అక్రమ వ్యవహారం పూర్తిగా బయటపడింది.

రోగాల బారిన గొర్రెలు కూడా స్వాధీనం

తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే నిర్వాహకుడికి సంబంధించిన మరో అక్రమం బయటపడింది. రోగాల బారిన పడిన మూడు గొర్రెలను ఆటోలో తీసుకువస్తుండగా అధికారులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గొర్రెలను కూడా మాంసంగా మార్చి విక్రయించే యత్నం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాసిరకం, కుళ్లిపోయిన మాంసం విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని మండిపడ్డారు. నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానికులు తోళ్ల రాకేష్, బొమ్మ ఉదయ్, దుర్గ తదితరులు కీలకంగా వ్యవహరించి అధికారులకు సమాచారం అందించారు. వారి చొరవతోనే ఈ అక్రమ దందా బయటపడిందని అధికారులు తెలిపారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు  స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.