epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేప‌టి నుంచి కొమ్మాల‌ బ్రహ్మోత్సవాలు

రేప‌టినుంచి కొమ్మాల‌ బ్రహ్మోత్సవాలు
27న స్వామివారి కల్యాణం… మార్చి 3న ప్ర‌భ‌ బండ్లు తిరుగుట
7వ తేదీన రథోత్సవం

కాకతీయ, గీసుగొండ : వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించే కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జాతర రేప‌టి  నుంచి ప్రారంభం కానుంది హోళీ పండుగ సందర్భంగా మొదలయ్యే ఈ జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో ప్రభలను ఈ స్థాయిలో ప్రదర్శించే అరుదైన జాతరగా కొమ్మాల జాతర ప్రత్యేక గుర్తింపు పొందింది. హోళీ రోజున ఆలయ గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట సందర్భంగా ప్రభల సందడి తారాస్థాయికి చేరుతుంది. రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, గ్రామస్తులు భారీ ప్రభ బండ్లను నిర్మించి స్వామివారిపై భక్తిని, తమ ప్రాబల్యాన్ని చాటుకుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, శిల్పకళా రూపకల్పనలతో అలంకరించిన ప్రభలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోటప్పకొండ జాతరలో ప్రభలు కనిపించినా, తెలంగాణలో మాత్రం కొమ్మాల జాతర ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

బ్రహ్మోత్సవాల వైభవం

ఈ నెల 23 నుంచి మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ట్రస్టీ చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. 23న అధ్యయనోత్సవంతో ప్రారంభమై 24న ప్రబంధసేవ, 25న నిత్యవిది, పరమపదోత్సవం, 26న అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం నిర్వహిస్తారు. 27న రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. 28న హనుమత్సేవ, వాహనసేవలు, మార్చి 1న నిత్యహోమం, సింహవాహనసేవ, 2న గరుడవాహనసేవ, పర్వతబలి నిర్వహిస్తారు. మార్చి 3న శకటయానోత్సవం, బండ్లు తిరుగుట ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 7వ తేదీన రథోత్సవం, 8న పారువేట, పుష్పయాగం, నాగవెల్లి, 9న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశంతో అధికారులు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. ప్రభల వెలుగుల్లో, భక్తుల భక్తితో కొమ్మాల నరసింహస్వామి జాతర వైభవంగా కొనసాగనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.