epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు…
కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో :

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టి మొత్తం 45 మందిని మార్చింది. ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
జీవో ఆర్‌టి నెం. 290 ప్రకారం మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పరిశ్రమలు, ఐటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఆర్‌ఎస్‌ఏడీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎన్. శ్రీధర్‌ను ఐటి, పరిశ్రమల శాఖల ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు గనులు, భూగర్భ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

రాహుల్ బొజ్జాను ఐ అండ్ సి ఏ డి శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ. శ్రీధర్‌ను సాగునీటి మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించారు. డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను తెలంగాణ భవన్ సమన్వయ విభాగం నుంచి ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

మహబూబ్‌నగర్ కలెక్టర్ బి. విజయేంద్రను సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమాఖ్య కార్యదర్శిగా, షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి కమిషనర్‌గా నియమించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్‌పతి‌ను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేయగా, ఆమె స్థానంలో చిత్ర మిశ్రాను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసి, నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ నియమితులయ్యారు.

జంగావ్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, నారాయణపేట, హనుమకొండ, జోగులాంబ గద్వాల జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ పదవుల్లో కూడా మార్పులు చేసి కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ జోన్లకు కొత్త అధికారులను నియమించారు.

ఇలా పరిపాలన అవసరాల దృష్ట్యా శాఖల మార్పులు, జిల్లాల కలెక్టర్ల బదిలీలు, అదనపు బాధ్యతల కేటాయింపులతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.