epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన
రేడియేషన్ భయం… అనుమతులపై అనుమానాలు
సాయినగర్‌లో టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అందోళన

కాకతీయ, మణుగూరు :  మణుగూరు మండలాల్లో ఇండ్ల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనావాసాల నడుమ టవర్లు నిర్మించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో టవర్ల సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే ఇవి నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం సరైనదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అనారోగ్యానికి గురవుతారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్షుల ఉనికి తగ్గిపోవడానికి కూడా ఇదే కారణమని కొందరు చెబుతున్నారు.

సెల్ టవర్ నిర్మాణం చేయొద్దని అధికారికి వినతిపత్రం అందించిన గ్రామస్థులు…

ఇండ్ల మధ్య టవర్ల ఏర్పాటు

మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. టవర్ నిర్మించబోయే ప్రదేశానికి చుట్టుపక్కల యాభై మీటర్ల పరిధిలో అనేక ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో టవర్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు మండిపడుతున్నారు.టవర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విధానంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సరైన పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల కోసం ఇండ్ల మధ్య టవర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు.

రేడియేషన్ వల్ల ప్రాణాలకు ముప్పు…?

జనావాసాల మధ్య ఉన్న టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కొందరు మేధావులు చెబుతున్నారు. ఐదు వందల నుంచి వెయ్యి మీటర్ల పరిధిలో ప్రభావం ఉంటుందని అంటున్నారు. క్యాన్సర్, నిద్రలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భయపడుతున్నారు.అలాగే పటిష్ఠంగా లేని భవనాలపై భారీ బరువున్న టవర్లు ఏర్పాటు చేయడం భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. జనావాసాల మధ్య టవర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.సాయినగర్ ప్రాంత ప్రజలు టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తమ అభ్యర్థనలను పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతామని, అవసరమైతే టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.జనావాసాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ప్రజల్లో నమ్మకం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రజల అనుమానాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.