epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట

ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట
99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి
రెవెన్యూ – అటవీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాల్లో చోటుచేసుకున్న లోపాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో సరైన లెవల్స్ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా సమావేశమై, ఎక్కడైతే నీరు ఆగుతుందో ఆ ప్రాంతాలను గుర్తించి తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. అవసరమైతే లోపభూయిష్టమైన నిర్మాణాలను తొలగించి, కొత్తగా నిర్మించాలని సూచించారు. ఏ అధికారి హయాంలో ఈ పొరపాట్లు జరిగాయో రికార్డుల్లో నమోదు చేసి, వారిని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

అటవీ – రెవెన్యూ సరిహద్దు వివాదాలకు ముగింపు

ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ మరియు రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఈ 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా వంటి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు మరియు రెవెన్యూ యంత్రాంగం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సరిహద్దులను ఖరారు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకుండా నూటికి నూరు శాతం పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ.. నిధుల వినియోగం

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్లు మరియు చైర్మన్లకు పాలనాపరమైన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న ఉమ్మడి జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అనుభవజ్ఞులైన అధికారులతో ఈ శిక్షణ ఇప్పించడం ద్వారా, గ్రామాల్లో నిధుల వినియోగంపై వారికి స్పష్టత వస్తుందన్నారు. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పంచాయతీ నిధులు ఇప్పుడు విడుదలవుతున్నాయని, వాటిని గ్రామాభివృద్ధికి పారదర్శక పద్ధతిలో ఖర్చు చేసేలా విలేజ్ సెక్రటరీలతో కలిసి పని చేయాలని సూచించారు.

సాగు పద్ధతుల్లో మార్పు.. రైతుల్లో చైతన్యం

వ్యవసాయ రంగంలో రైతులు విచక్షణారహితంగా వాడుతున్న ఎరువులు, పురుగుమందుల ప్రభావం భూసారంపై పడుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి రైతుకూ భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులే నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఆధునిక సాంకేతికతను వివరించాలని, అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని ఆదర్శ సాగు పద్ధతులను పరిశీలించేందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతులకు క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

పార్టీలకు అతీతంగా ప్రజా సేవ

ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నా, గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ ప్రజల కోసమే పని చేయాలని మంత్రి ఉద్ఘాటించారు. ఈ అభివృద్ధి ప్రణాళికలో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.