epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నల్లబెల్లి రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

నల్లబెల్లి రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
ప్రత్యేక వైద్య నిపుణులతో మెడికల్ క్యాంపు ప్రారంభం

కాకతీయ. నల్లబెల్లి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జీవన శైలిలో మార్పులు అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శనివారం నల్లబెల్లి రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహించే మెడికల్ క్యాంపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో మార్పులు చేసుకుని అందుబాటులో ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పూర్వకాలంలో పెద్దలు కష్టపడి పనిచేస్తూ సీజనల్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారని, వారి జీవన విధానాన్ని అనుసరించి క్రమబద్ధమైన జీవితం గడపాలని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మాతా, శిశు, కిశోర, వృద్ధుల ఆరోగ్య సేవలను నాలుగు దశలుగా అందిస్తూ మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు, టిబి పరీక్షలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను తెలంగాణ టీ-హబ్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరీక్షలు, చికిత్సలు అందిస్తామని పేర్కొన్నారు.

అలాగే మార్చి 8 నుంచి 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సంపేట, సీకేఎం ఆస్పత్రి వరంగల్, ఎంజీఎం వరంగల్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా విస్తరించనున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీవో ఉమా, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, జీజీహెచ్ నర్సంపేట డాక్టర్ కిషన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇఫ్తీకర్ అహ్మద్, డాక్టర్ విజయకుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.