epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..

కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..
ఆరు గ్యారంటీలు కాదు ఆరు మోసాలు
ఇదీ ప్రజలకు లాభం లేని బడ్జెట్
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు

కాకతీయ,ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసాలుగా మిగిలిపోయాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమర్శించారు. శనివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ, ఆరు గ్యారంటీలు ఆరు మోసాలుగా మారాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 420 అబద్ధాలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, క్షేత్రస్థాయి ఖర్చులకు ఎక్కడా పొంతన లేదన్నారు. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది అందరూ మోసపోయారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. 2025-26లో రాష్ట్ర అప్పులు 8,05,840 కోట్లుగా ఉన్నాయని, అవి 9 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. మూలధన వ్యయం 20 శాతానికే పరిమితమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు 50 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పినా, 58,713 కోట్ల రెవెన్యూ లోటు చూపించడం వాస్తవ పరిస్థితిని బయటపెడుతోందన్నారు. విద్యకు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. 15 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తే, 8 శాతానికే పరిమితం చేశారని విమర్శించారు. ఎస్సీ సంక్షేమానికి 40,234 కోట్ల నుంచి 11,784 కోట్లకు కోత విధించారని తెలిపారు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్ల నుంచి 7,937 కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు.

కేంద్ర నిధులతో గొప్పలు

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాపీ కొడుతోందని నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. గోదావరి పుష్కరాలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా విస్మరించారని అన్నారు. ఖమ్మం జిల్లాకు ఈ బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు, మున్నేరు మరమ్మతులు, తీగల వంతెనకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. వెలుగుమట్లలో భూ బాధితులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే పదవి వదలాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శాసన సాయిరాం, మణికంఠ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.