epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం
ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం
సుస్థిర నగర నిర్మాణానికి చర్యలు
యూజీడి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి
జీడ‌బ్ల్యూఎంసీ మేయ‌ర్ గుండు సుధారాణి
కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్ష స‌మావేశం

కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మహా నగర అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యంత కీలకమని నగర మేయర్ జి సుధారాణి అన్నారు. జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షా సమావేశంలో మేయర్, హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడి) ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను అధికారులు దృశ్యరూప ప్రదర్శన ద్వారా కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా

మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరం కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరమని, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరాన్ని శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో వరంగల్ నగర అభివృద్ధికి అపారమైన నిధులు కేటాయిస్తూ, నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని మేయర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టులకు రూ. 5,725.40 కోట్ల నిధులు మంజూరు చేయడం ఆయన సంకల్పానికి నిదర్శమని తెలిపారు. యూజీడి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి అయి, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని మేయర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నగర పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో యూజీడి ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయగలమని, వారి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టు విజయవంతమైన అమలుకు శాఖల మధ్య సమన్వయం కీలకమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేఎఫ్‌డబ్ల్యూ బృందం అందించిన సూచనలు ప్రాజెక్టు నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టుపై సమగ్రంగా వివరాలు అందించారని, రాబోయే రోజుల్లో మరిన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందిస్తామని తెలిపారు.
అనంతరం కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధుల బృందాన్ని మేయర్ కలెక్టర్ లు శాలువాలు, పూల మొక్కలతో సత్కరించి నగర కీర్తిని చాటే కాకతీయ కళా తోరణాలతో కూడిన ప్రతిమలను బహుకరించారు. కార్యక్రమం లో కేఎఫ్ డబ్ల్యూ ప్రతినిధులు పరిమల్, రుచి, నితిన్, ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాస్ రావు, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.