epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే
ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య
కరీంనగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం

కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ బస్తీలో చత్రపతి శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గోపూజతో కార్యక్రమం ప్రారంభమై అనంతరం సమ్మేళనం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ తడి గొప్పల శంకరయ్య మాట్లాడుతూ, సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజన హిందువులకు నష్టదాయకమని పేర్కొన్నారు. హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం, ధర్మం సుస్థిరంగా ఉంటాయని అన్నారు. ఐకమత్యం లోపిస్తే ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల మాదిరిగానే పరిస్థితులు ఏర్పడే అవకాశముందని హెచ్చరించారు.
హిందువులు సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉందని, సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ పిలుపుతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర సేవికా సమితి ప్రాంత శారీరక్ ప్రముఖ్ లెక్కల రమ మాట్లాడుతూ, హిందూ ధర్మం పురాతనమైనదిగా, విశిష్ట చరిత్ర కలిగినదిగా వివరించారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
ముఖ్య అతిథి మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన కార్యనిర్వహణ సమితి అధ్యక్షుడు పసుల మహిపాల్, గాజుల కృష్ణ, ఎన్నం శ్రీనివాస్, మేంగని రాజయ్యతో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, బస్తీ ప్రముఖులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.